Rajashekar shares venu madhavs last photo వేణుమాధవ్ అంతిమఫోటోను షేర్ చేసిన రాజశేఖర్

Hero rajashekar shares venu madhavs last photo from hospital

Comedian Venu Madhav, Rajashekar, last photo, jeevitha, Dr. Paramanandaiah Students Gang, Sampradayam, secunderabad, Venu Madhav, Venu Madhav age, Venu Madhav comedy, Venu Madhav dead, Venu Madhav death, Venu Madhav dies, Venu Madhav news, Venu Madhav passes away, Venu Madhavdeath today, venu madhav latest news, tollywood Comedian, tollywood, movies, entertainment

tollywood hero Rajashekar says Popular comedian Venu Madhav, was their family friend, who had breathed his last yesterday. Rajasekhar condolences to comedian venu madhav shares last photo from hospital

వేణుమాధవ్ అంతిమఫోటోను షేర్ చేసిన రాజశేఖర్

Posted: 09/26/2019 11:51 AM IST
Hero rajashekar shares venu madhavs last photo from hospital

హాస్య నటుడు వేణు మాధవ్ అకాల మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది. ఈ సందర్భంగా వేణు మాధవ్ తో వున్న అనుబంధాన్ని ప్రతి ఒక్కరు పంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, నాని, వరుణ్ తేజ్ లతో పాటు టాలీవుడ్ యంగ్ హీరోలు, కమెడియన్లు సీనియర్ నటీ నటులు, రాజీకీయ సినీ రంగ ప్రముఖులు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ తరుణంలో హీరో రాజశేఖర్ వేణు మాధవ్ తో తనకున్న అనుబంధాన్ని పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఒక నటుడిగానే కాకుండా వ్యక్తిగతంగా వేణు మాధవ్ తనకు మంచి స్నేహితుడన్నారు. వరుసలు పెట్టి పిలుచుకునేంత చనువు అతనితో ఉందని.. నన్ను బాబా అని, జీవితను అక్క అంటూ ఆప్యాయంగా పిలిచే వారన్నారు. ఇటీవల జరిగిన మా ఎన్నికల్లోనూ ఆయనకు హెల్త్ బాలేకపోయినప్పటికీ పోటీ చేసి ఈసీ మెంబర్‌గా గెలుపొందారన్నారు.

సాటి కళాకారులకు సాయం చేయాలని తపన పడే వేణు మాధవ్‌ ఈ లోకాన్ని విడిచి వెళ్లడం బాధాకరం అన్నారు రాజశేఖర్. అయితే వారం రోజుల క్రితం ఆయన అనారోగ్యంతో ఉంటే హాస్పిటల్‌కి వెళ్లి కలిశాను. అప్పుడు చాలా యాక్టివ్‌గానే వున్న ఆయన.. అనుకోకుండా మళ్లీ పరిస్థితి విషమించి హాస్పటల్ లో చేరి.. తిరిగిరాని లోకాలకు వెళ్లారు’ అంటూ వేణు మాధవ్ తో చివరిగా దిగిన ఫొటోను షేర్ చేశారు రాజశేఖర్. ఇందులో వేణు మాధవ్ అసలు గుర్తు పట్టలేనంగా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : venu madhav  comedian  passes away  Rajashekar  last photo  jeevitha  tollywood  

Other Articles

Today on Telugu Wishesh