ED arrests Kamal Nath's nephew in bank scam ‘‘మేనల్లుడి వ్యాపారాలతో సంబంధం లేదు’’: ముఖ్యమంత్రి

No connection with arrested nephew s business says kamal nath

ratul puri, kamal nath, kamal nath's nephew ratul puri, cm kamal nath, kamal nath news, businessman ratul puri, AugustaWestland VVIP chopper deal, money laundering case, Justice Sunil Gaur, Abhishek Manu Singhvi, bank fraud case, Additional Solicitor General Aman Lekhi, ratul puri news, Crime

The Delhi High court reserved its order on an anticipatory bail plea of businessman Ratul Puri, nephew of Madhya Pradesh Chief Minister Kamal Nath, in connection with a money laundering case related to AugustaWestland VVIP chopper deal.

రాతుల్ పురి ముందస్తు బెయిల్ పై తీర్పు రిజర్వు

Posted: 08/20/2019 04:15 PM IST
No connection with arrested nephew s business says kamal nath

మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ మేనల్లుడు, వ్యాపారవేత్త రతుల్ పురి ముందస్తు బెయిల్ పిటీషన్ పై ఇరు తరపు వాదనలను విన్న న్యాయస్థానం తన తీర్పును రిజర్వులో ఉంచింది. రతుల్ పురి తరుపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింగ్వి వాదనలు వినిపించగా, అడిషనల్ సాలిసిటర్ జనరల్ అమన్ లెఖ్కి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తరపున వాదించారు. ఇరు తరపు వాదనలను విన్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సునీల్ గౌర్.. రతుల్ పురి ముందస్తు బెయిల్ పిటీషన్ పై తీర్పును రిజర్వులో ఉంచారు.

ఆగస్టా వెస్ట్ లాండ్ ఛాపర్ల కేసులో భారీగా అమ్యామ్యాలను అందుకున్నారన్న అభియోగాలపై విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను మోసం చేసిన కేసులో అదుపులోకి తీసుకుని విచారించిందని సంబంధం లేని కేసులో విచారణకు పిలిచి మరో కేసులో అదుపులోకి ఎలా తీసుకుంటారని మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ మేనల్లుడు రతుల్ పురి తరపున న్యాయవాది అభిషేక్ మను సింగ్వి న్యాయస్థానంలో వాదించారు. పురి బయట వుండటం వల్ల సాక్షులను ప్రభావితం చేయడం, అధారాలు లభ్యం కాకుండా చేయడం వంటి చర్యలు తీసుకునే ప్రమాదముందని ఈడీ చెబుతోందని సింగ్వి అన్నారు.

కాగా, ఈడీ అధికారుల అదుపులో వున్న రతుల్ పురి రెండు కేసుల్లోనూ అభియోగాలను ఎదుర్కోంటున్నాడరని ఓ వైపు ముడుపులు తీసుకున్న కేసుతో పాటు అమ్యామ్యాలు అందుకున్న అంశాలున్నాయని.. ఆయన ఏయే కేసులో ఎంత మేర అవినీతికి పాల్పడారన్న, ఆయన ఎలాంటి ప్రభావం చూపారన్న విషయాలను తెలిపుతూ న్యాయస్థానం ఎదుట నివేదికలను సమర్పించామని తెలిపారు. ఈ క్రమంలోనే ఆయనను ఎన్‌ ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అదుపులోకి తీసుకుందని తెలిపారు. నిన్న రాత్రి మనీ లాండరింగ్ చట్టం కింద ఆయన్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

అసలేం జరిగిందంటే..

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు మేరకు మోసర్ బేర్ కు గతంలో ఈడీగా ఉన్న సమయంలో రతుల్ పురిపై ఈ కేసు నమోదైంది. ఆ సంస్థలో పనిచేసిన డైరెక్టర్ల ఇళ్లపైనా, కార్యాలయాలపైనా దాడులు జరిపిన ఈడీ, నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ, తదితర ఆరోపణల కింద రతుల్ పురి, ఆయన తండ్రి, మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ పురి, ఇతర డైరెక్టర్లుగా ఉన్న రతుల్ తల్లి, కమల్ నాథ్ సోదరి నీతాపురిలతో పాటు సంజయ్ జైన్, వినీత్ శర్మలపై కేసులు రిజిస్టర్ చేసింది.

 2012లోనే రతుల్ మోసర్ బేర్ లో తన ఈడీ పదవికి రాజీనామా చేయగా, ఆయన తల్లిదండ్రులు మాత్రం విధుల్లో కొనసాగుతూ వచ్చారు. ఈ విషయాన్ని తన ఫిర్యాదులో తెలిపిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కాంపాక్ట్ డిస్క్‌ లతో పాటు డీవీడీలు, స్టోరేజ్ డివైజ్‌ లు తయారు చేసిన మోసర్ బేర్, 2009 నుంచి రుణాలు తీసుకుందని, వాటిని తిరిగి చెల్లించలేదని ఆరోపించింది. ఫోరెన్సిక్ ఆడిట్ జరిపినప్పుడు వారి ఖాతాలను 'ఫ్రాడ్ అకౌంట్‌'గా నిర్ధారించి, ఆపై ఫిర్యాదు చేశామని ఓ ప్రకటనలో తెలిపింది. మొత్తం రూ. 354.51 కోట్ల మేరకు తమకు నష్టం వాటిల్లిందని బ్యాంకు అధికారులు తెలిపారు

మేనల్లుడి వ్యాపారంతో సంబంధం లేదు: కమల్ నాథ్

తన సోదరి, బావలతో పాటు మేనల్లుడు రతుల్ పురి అరెస్టుపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ స్పందించారు. తనకు తన మేనల్లుడి వ్యాపారాలతో ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. బ్యాంకును 354.51 కోట్ల రూపాయల మేర మోసం చేశారని రతుల్ పురి అరెస్టుపై స్పందించిన ఆయన తన మేనల్లుడి వ్యాపారాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆయా వాణిజ్య సంస్థల్లో తాను డైరెక్టర్, షేర్ హోల్డర్ కూడా కాదని చెప్పుకొచ్చారు. అయితే ఈ ఘటనపై మూడు దర్యాప్తు బృందాలు ఆదాయశాఖ, సీబిఐ, ఈడీలు దర్యాప్తు చేస్తున్నాయని నిజానిజాలేంటో అవే వెలుగులోకి వస్తాయని ఆయన అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ratul puri  kamal nath  Bank loan  moser baer  deepak puri  nita puri  central bank of India  bad debts  crime  

Other Articles

Today on Telugu Wishesh