JSP urges not to stop development activities

Pawan kalyan urges not to stop development activities in state

Pawan Kalyan, Janasena, west godavari, key leaders meeting, Bhimavaram, dumping yard, YSRCP, CM Jagan, AP Capital Amaravathi, polavaram, Chandrababu, Nara Lokesh, TDP. BJP, Andhra Pradesh, Politics

JanaSena chief Pawan Kalyan suggested the andhra pradesh government should not stop development activities taken up in the state by previous Government. Mainly by stoping of polavaram, and capital amaravathi is like curse to people of state.

అభివృద్ది పనులను అపడం ప్రజలకు శాపం: పవన్ కల్యాణ్..

Posted: 08/05/2019 05:21 PM IST
Pawan kalyan urges not to stop development activities in state

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు జరిగిన సార్వత్రిక ఎన్నికలలో జనసేన పార్టీ అతి విశ్వాసంతో ఓటమిని చవిచూసిందని, అయినా తన పార్టీకి, తమ నేతలకు లభిస్తున్న ఆదరణ చూస్తుంటే సంతోషంగా వుందని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. తమ పార్టీకి, నాయకులకు ఇదే తరహా ఆధరణ లభించడం తనకు సంతోషాన్నిస్తుందని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారగానే అభివృద్ది పనులకు ఆటంకం కలగడం సముచితం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిని వెలికితీసే క్రమంలో ప్రజలు నష్టపోరాదని, గత ప్రభుత్వ అవకతవకలు సరిచేసుకుంటూ ముందుకు వెళ్లాలే తప్ప ప్రాజెక్టులను మొత్తానికే నిలిపివేయడం సరికాదని ఆయన సూచించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఆయన పర్యటిస్తున్న విషయం తెలిసిందే. భీమవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, అమరావతి నిర్మాణం నిలిపివేయడం వల్ల దాదాపు 20 వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కోల్పోయారని అన్నారు.

వ్యక్తిగత కక్షలతో పోలవరం ప్రాజెక్టును నిలిపివేయడంలో ఏదో లోతైన విషయం ఉందన్న పవన్ కల్యాణ్, చిల్లర రాజకీయాల మూలంగా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి చర్యల వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రావని, అవగాహన ఉన్న నాయకులు చేయాల్సిన పని కాదని అన్నారు. భీమవరంలో గెలిచిన నేతలు డపింగ్ యార్డు సమస్యను సత్వరంగా పరిష్కరించాలని కూడా పవన్ డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తుల గురించి ఇంకా ఆలోచించలేదని, ముందు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపైనే దృష్టి పెట్టినట్లు వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Janasena  west godavari  Bhimavaram  dumping yard  Andhra Pradesh  Politics  

Other Articles