Revanth reddy, Sampath protest in front of Inter Board ఇంటర్ విద్యార్థుల పక్షాన రేవంత్ ధర్నా,.. అరెస్టు

Tpcc chief uttamkumar reddy open letter to cm kcr on inter results

Revanth reddy protest inter board, revanth reddy arrest intermIediate board, Revanth reddy, Uttam kumar Reddy, Uttam kumar Reddy open letter to KCR, Uttam kumar Reddy open letter on interstudents, Telangana CM, Intermiediate results, KTR, open failure, Telangana, politics

Revanth Reddy along with other Congress leader Sampath Reddy joined the stir at Intermediate Board in Nampally where the student unions and aggrieved parents staged dharna over results goof up. They demanded justice to the students and stringent action against the inter board officials.

ఉత్తమ్ ఓపెన్ లెటర్.. ఇంటర్ విద్యార్థుల పక్షాన రేవంత్ ధర్నా,.. అరెస్టు

Posted: 04/22/2019 04:54 PM IST
Tpcc chief uttamkumar reddy open letter to cm kcr on inter results

తెలంగాణ ఇంటర్ బోర్డు విడుదల చేసిన ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు వివాదాస్పదమైన నేపథ్యంలో కాంగ్రెస్ పీసీస అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. అధికారుల నిర్లక్ష్యమై తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఇంటర్ బోర్డు ముందు ఆందోళనకు దిగాల్సిన పరిస్థితి వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై అసలు స్పందించకపోవడం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ విద్యార్థులు మార్కులు రాక అత్మహత్యలకు పూనుకుంటున్నా.. రాష్ట్ర ప్రభుత్వం కనీసం చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

అయితే, తెలంగాణ విద్యాశాఖ మంత్రిని తక్షణం భర్తరఫ్‌ చేయాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు లేఖ రాసిన ఉత్తమ్.. ఫలితాల్లో అవకతవకలకు కారణమైన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎంతసేపు రాజకీయ ప్రయోజనాల అలోచనలు, ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుందామనే ధ్యాసే తప్పితే.. పాలన గాడి తప్పిందని చెప్పడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని, తెలంగాణ విద్యార్థులు.. తెలంగాణ రాష్ట్రంలో పిట్టెల్లా రాలిపోతున్నా పట్టించుకోరా అని ఆయన లేఖలో తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.

ఎన్నికల ముందు పథకాలను ప్రవేశపెట్టి.. ప్రజల్లో విరివిగా తిరగి ఉపన్యాసాలు దంచి కోడతారే తప్ప.. నిజాంగా ప్రజల సమస్యలు పరిష్కారానికి మీరు ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. వర్షాలు పడి కుంటలకు, చెరువులకు గండిపడితే.. తెలంగాణ ప్రజలు యాటలు కోసుకుని పండగ చేసుకుంటున్నారని కేసీఆర్ కు కలపడుతుందని.. తాజాగా అధికారుల నిర్లక్ష్యంతో విద్యార్థులు విపరీత నిర్ణయాలు తీసుకుంటుంటే.. విద్యార్థులు ఫెయిల్ అయినందుకు స్వీటు పంచుకున్నారని కూడా త్వరలోనే కేసీఆర్ అంటారని ఉత్తమ్ కుమార్ వ్యంగంగా వ్యాఖ్యానించారు. అవినీతి ప్రక్షాళన అని ప్రగల్భాలు పలుకుతున్న కేసీఆర్... ఇంటర్మీడియట్ బోర్టుని ఎందుకు ప్రక్షాళన చేయరు అని ప్రశ్నించారు. మరోవైపు రాజకీయ అవినీతిని సీఎం కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.

ఇంటర్ బోర్డు ముందు రేవంత్ రెడ్డి అరెస్టు.,.

ఇంటర్‌ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నేతలు రేవంత్‌రెడ్డి, సంపత్‌ కుమార్ లు ధర్నా చేపట్టారు. ఇంటర్ బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు. ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం వల్ల వేల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని.. విద్యార్థుల తల్లిదండ్రులను కనీసం బోర్టు కార్యాలయంలోనికి కూడా రానివ్వడం లేదని అన్నారు. తల్లిదండ్రులకు ఇంటర్‌ బోర్డు అధికారులు సమాధానం చెప్పాలన్న ఆయన.. ఇప్పటి వరకు సీఎం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. అప్పటికే ఏబీవీపీ కార్యకర్తలు అక్కడ ధర్నా చేస్తుండగా.. రేవంత్‌ రాకతో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది. ఈక్రమంలో పోలీసులు రేవంత్‌, సంపత్ లను అరెస్టు చేశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Revanth reddy  Uttam kumar Reddy  KCR  Telangana CM  Intermiediate results  KTR  open failure  Telangana  politics  

Other Articles