NIA conducts searches in Hyderabad ఐసీస్ మాడ్యూల్ కేసు: హైదరాబాదుతో ముడిపడ్డ లింకు.. తనిఖీలు..

Isis module case nia conducts searches in hyderabad

NIA arrest, ISIS, ISIS module case, NIA raid in Hyderabad, Mohammed Abdullah Basith, Mohd Abdul Qhadeer, Islamic state module case, Mylardevpally, shastripuram, Cyberabad police, Hyderabad, Crime

The National Investigation Agency (NIA) conducted searches at two locations here on April 20 in connection with an Islamic state module case, police said. The raids which began in the morning were still underway, they said.

ఐసీస్ మాడ్యూల్ కేసు: హైదరాబాదుతో ముడిపడ్డ లింకు.. తనిఖీలు..

Posted: 04/20/2019 12:26 PM IST
Isis module case nia conducts searches in hyderabad

హైదరాబాద్‌ నగరంలో మళ్లీ ఉగ్రవాదులు తలదాచుకుంటున్నారన్న వార్త నగరవాసులను భయకంపింతుల్ని చేస్తోంది. గోకుల్ ఛాట్, మక్కామసీదు, దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల ఘటనలను మిగిల్చిన విషాదాలను నగరవాసులు స్మృతుల నుంచి ఇంకా చెరిగిపోకముందే.. మరోమారు ఉగ్రవాదమూకలు ఇక్కడ తలదాచుకుంటున్నాయన్న వార్త నగరవాసుల్ని భయాందోళనకు గురిచేస్తోంది. మళ్లీ వారు ఏ కుట్రలకు, కుతంత్రాలకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నారన్న అందోళన నగరవాసుల్లో వ్యక్తమవుతోంది.

నగరంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారంతో రాజధానిశివారు ప్రాంతమైన మైలార్ దేవ్ పల్లి పరిధిలోని శాస్త్రిపురంలో జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఐసిస్‌ ఉగ్రవాది అబ్దుల్‌ బాసిత్‌ అనుచరులు ఇక్కడ తలదాచుకున్నారన్న అనుమానంతో ఈ సోదాలు చేపట్టారు. స్థానిక పోలీసులతో కలసి ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. పలువురి ఇళ్లలో శనివారం ఉదయం నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి.

2018 ఫిబ్రవరిలో ఉగ్రవాది అబ్దుల్‌ బాసిత్‌ను ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకుంది. అబుదాబిలో ఐసిస్‌ మాడ్యూల్‌ కేసులో అతడిపై ఛార్జిషీటు నమోదైంది. మరికొందరికి ఐసిస్‌తో సంబంధం ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ఎన్‌ఐఏ అధికారులు శాస్త్రిపురంలోని 8 మంది ఐసిస్ సానుభూతిపరులకు సంబంధించిన ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. అబ్దుల్ బాసిత్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ దాడులు కొనసాగుతున్నట్లు సమాచారం.

కాగా, ఎన్ఐఏ సోదాల్లో బయటపడిన విషయాలపై ఎలాంటి స్పష్టత లేదు. ఢిల్లీలో ఓ వీహెచ్‌పీ నేత హత్యకు అబ్దుల్ బాసిత్ వేసిన పథకాన్ని భగ్నం చేసిన పోలీసులు నలుగురు యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. దీంతో అతడు హైదరాబాద్‌కు పారిపోయివచ్చాడు. అనంతరం ఇక్కడ కొంత మంది యువకులతో కలిసి ఉగ్రదాడులకు వ్యూహరచన చేయడంతో బాసిత్‌ను పోలీసులు వలపన్ని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా, మరోసారి అంతర్జాలం ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలను ప్రారంభించినట్టు గుర్తించడంతో ఎన్ఐఏ రంగంలోకి దిగింది. కింగ్స్ కాలనీలోని ఎనిమిది ఇళ్లలో సోదాలు నిర్వహించిన అధికారులు, బాసిత్, అతడితోపాటు అదుపులోకి తీసుకున్న ఇద్దరి సహచరుల కుటుంబసభ్యులను ప్రశ్నించారు.

అలాగే తహా అనే అనుమానితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఢిల్లీ ఎయిర్‌పోర్టులో రహమాన్ అనే తీవ్రవాది ఇచ్చిన సమాచారంతో పాతబస్తీలోని షాహిన్‌నగర్, పహాడీషరీఫ్‌లో ఎన్ఐఏ తనిఖీలు జరిపిన విషయం తెలిసిందే. ఐసిస్‌తో సంబంధాలున్న కొందరు వ్యక్తులు ఇక్కడ తలదాచుకున్నారన్న సమాచారంతో గాలింపు చేపట్టారు. ఈ సోదాల్లో ఇద్దరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. అలాగే ఓ ఇంట్లో కీలకమైన ల్యాప్‌టాప్‌తో పాటూ మొబైల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NIA arrest  ISIS  ISIS module case  NIA raid  Mylardevpally  shastripuram  Cyberabad police  Hyderabad  Crime  

Other Articles