CJI sexually harassed me, says former SC staffer సీజేఐపై లైంగిక అరోపణలు.. స్పందించిన రంజన్ గొగోయ్

Cji ranjan gogoi says judiciary under very serious threat asks media for self restraint

CJI Ranjan Gogoi, supreme court, CJI Ranjan Gogoi denies charges of sexual harassment, justice Arun Mishra, justice Sanjiv Khanna, CJI Ranjan Gogoi news, CJI Ranjan Gogoi live updates, CJI Ranjan Gogoi latest news, CJI Ranjan Gogoi supreme court news, Chief Justice of India, Supreme Court, Sexual Harassment, Delhi Police, #MeToo, Ranjan Gogoi, CJI, justice gogoi, supreme court india, SC, ranjan gogoi news, cji of india, cji gogoi, me too, me too india, ranjan gogoi sexual harassment

Chief Justice of India Ranjan Gogoi has denied charges of sexual harassment levelled by a former a woman employee against him. CJI Ranjan Gogoi was hearing a special sitting inside the Supreme Court on a matter of great public importance. Besides CJI Ranjan Gogoi, the bench comprises justices Arun Mishra and Sanjiv Khanna.

సీజేఐపై లైంగిక అరోపణలు.. స్పందించిన రంజన్ గొగోయ్

Posted: 04/20/2019 01:17 PM IST
Cji ranjan gogoi says judiciary under very serious threat asks media for self restraint

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మాజీ ఉద్యోగిని ఒకరు.. అదే న్యాయస్థానంలోని 22 మంది న్యాయమూర్తులకు భారత ప్రధాన న్యాయమూర్తిపై అభియోగాలు మోపుతూ రాసిన లేఖపై స్పందించిన జస్టిస్ రంజన్ గొగోయ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. దేశంలోని అత్యధిక మంది ప్రజలు కేవలం న్యాయవ్యవస్థపైనే ఆశలు పెట్టుకున్నారని.. ఇలాంటి ఘటనల వల్ల అది కూడా సన్నగిల్లుతుందని.. దీంతో న్యాయవ్యవస్థలోకి, అందునా న్యాయమూర్తులుగా ఇక ఉత్తమవ్యక్తిత్వం వున్నవాళ్లు ఎవరూ రారని, దీంతో న్యాయవ్యవస్థకు పెను ముప్పు వాటిల్లనుందని ఆయన అవేదన వ్యక్తం చేశారు.

భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ పై లైంగిక అరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు సీజేఐ జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో ప్రత్యేక బెంచ్ ను ఏర్పాటు చేశారు. విచారణ సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనై.. తన వ్యక్తిగత విషయాలను విచారణలో వ్యక్తం చేశారు. తాను జడ్జీగా 20 ఏళ్లు పనిచేశాననీ, తన బ్యాంకు బ్యాలెన్స్ రూ.6 లక్షలు ఉండగా, పీఎఫ్ సొమ్ము రూ.40 లక్షలు మాత్రమే ఉందని గొగోయ్ తెలిపారు. ‘డబ్బు విషయంలో తనను దెబ్బకొట్టలేని కొన్ని శక్తులు ఈ ఆరోపణలు చేయిస్తున్నాయి. ఇప్పుడు భారత న్యాయవ్యవస్థ చాలా తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటోంది. న్యాయవ్యవస్థను అస్థిరపరిచేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. తనపై వచ్చిన ఆరోపణల వెనుక చాలా బలీయమైన శక్తులు ఉన్నాయని వ్యాఖ్యానించారు.

అసలేం జరిగిందంటే.. సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ పై ఓ మాజీ జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ మహిళా ఉద్యోగి.. తనను సీజేఐ లైంగికంగా వేధించారని ఆరోపించారు. తన నివాస కార్యాలయంలో రంజన్ గొగోయ్ తనపై లైంగిక వేధింపులకు దిగారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వేధింపులు 2018, అక్టోబర్ 10-11 తేదీల్లో చోటుచేసుకున్నాయని బాధితురాలు తెలిపింది. ‘‘రంజన్ గొగోయ్ వెనుక నుంచి నా నడుము చుట్టు చేయివేసి నన్ను గట్టిగా పట్టుకున్నారు. చేతులతో నా శరీరమంతా తడిమారు. అనంతరం గట్టిగా హత్తుకున్నారు. ‘నువ్వు కూడా నన్ను కౌగిలించుకో’ అని కోరారు. దీంతో ఆయన నుంచి తప్పించుకోవడానికి నేను పెనుగులాడాను. ఆయన నుంచి తప్పించుకుని బయటపడ్డాను. ఇది జరిగిన 2 నెలలకే నన్ను ఉద్యోగం నుంచి తొలగించారని అరోపించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles