Rahul Gandhi enjoys hillarous translation of PJ Kurien నెట్టింట్లో వైరల్: రాహుల్ ప్రసంగ అనువాదం చేసిన కురియన్

Oops when rahul gandhi s translator pj kurien said congress chief to deposit rs 72 000 crore

Rahul Gandhi, PJ Kurien, PJ Kurien translation video, PJ Kurien struggling to address, PJ Kurien hearing problem, Pathanamthitta rally, hillarous, social media, websites, Kerala, viral video, politics

Congress president Rahul Gandhi, senior party leader PJ Kurien video of struggling to address the massive crowd in Kerala went viral on social networking sites with different social media pages and websites adding a fun and comic fervour to it.

ITEMVIDEOS: మలయాళం నేర్చుకుంటానన్న రాహుల్ గాంధీ.. ఎందుకంటే..

Posted: 04/17/2019 04:51 PM IST
Oops when rahul gandhi s translator pj kurien said congress chief to deposit rs 72 000 crore

కేరళలోని వయనాడ్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఈ సారి బరిలో నిలుస్తున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ఎన్నికలు ముగిసిన తరువాత తాను మలయాళం నేర్చుకుంటానని అన్నారు. ఉత్తర్, దక్షిణ భారతాలు తనకు సమానమని అందుకనే తాను కేరళ నుంచి ప్రాతినిథ్యం వహించేందుకు వయనాడ్ నుంచి పోటీ చేస్తానని చెప్పిన రాహుల్ గాంధీ.. మలయాళం నేర్చుకుంటానని ఎందుకు చెప్పారు. ఈ రెండింటికీ సంబంధమేంటి అంటారా.? కేరళవాసుల ఓట్లను కొల్లగొట్టేందుకే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారా.? లేక దీని వెనుక మరో అంతరార్థం వుందా.?

అంటే నిజమే దీని వెనుక మరో సత్యం దాగివుంది. దేశంలోని అటు ఈశాన్య, పశ్చిమ ప్రాంతాలతో పాటు ఇటు దక్షిణ ప్రాంతాలకు జాతీయ నాయకులు వెళ్లినప్పుడు.. వారి ప్రసంగాలను అనుభవజ్ఞులైన అనువాదకులు నేతల వ్యాఖ్యలను అనువదిస్తారు. అయితే పతనంథిట్టలో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తున్న వేళ, దాన్ని అనువదించిన మాజీ రాజ్యసభ ఉపసభాపతి పీజే కురియన్ అపసోపాలు పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, చూస్తున్న వారిలో నవ్వులు పూయిస్తోంది. అయితే రాహుల్ గాంధీ కూడా ఆయనకు వేదికపైనే మళ్లీ మళ్లీ తాను చెప్పిన మాటలనే కురియన్ చెవిలో కూడా చెప్పాల్సి వచ్చింది.

అయితే తన ప్రసంగంలో అడుగడుగునా ఇలా జరిగినా ఏ మాత్రం విసుగులేకుండా.. నవ్వుతూనే తన ప్రసంగాన్ని కొనసాగించారు రాహుల్ గాందీ. ఈ క్రమంలో చాలాసార్లు తడబడుతున్న కురియన్ ను చూసి, కాసేపు నవ్వు మొహంతోనే కనిపించిన రాహుల్ తన ప్రసంగాన్ని ముగిస్తూ.. ఇక తాను మలయాళం బాషను కూడా నేర్చుకోవాల్సిందేనని చెప్పారు. ఈ క్రమంలో రాహుల్ ప్రసంగాన్ని అనువదించిన కురియన్ పేద ప్రజలకు కనిష్ట అదాయ పథకం న్యాయ్ పై ప్రసంగిస్తూ.. రాహుల్ గాంధీ ఏటా 72 వేల కోట్ల రూపాయలను ఐదు కోట్ల బ్యాంకు అకౌంట్లలో జమచేస్తారని పోరబాటుగా అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles