BJP's Moradabad Candidate Unsure Of Win ఈ సారి గెలవడం కష్టమే,, నిరుత్సాహపడిన బీజేపి అభ్యర్థి

Lok sabha elections 2019 bjp candidate says will be difficult to retain moradabad

Kunwar Sarvesh Kumar singh, Moradabad, candidate, muslim, lok sabha elections 2019, BJP, SP-BSP, S T Hasan, Imran Pratapgarhi, Congress, Uttar Pradesh, Politics

It is going to be difficult to retain Moradabad Lok Sabha constituency for BJP, which is in a direct contest with Congress due to consolidation of Muslim votes ahead of the April 23 election, its candidate Kunwar Sarvesh Kumar Singh has said.

ఈ సారి గెలవడం కష్టమే,, నిరుత్సాహపడిన బీజేపి అభ్యర్థి

Posted: 04/17/2019 03:57 PM IST
Lok sabha elections 2019 bjp candidate says will be difficult to retain moradabad

గత ఎన్నికలలో అప్పటి ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ దేశవ్యాప్తంగా వచ్చిన క్రేజ్, నమో సమ్మోహనం.. మోడీ మ్యానియా అంతాఇంతా కాదు. క్రితం పర్యాయం బీజేపి టిక్కెట్ లభించిన ఏ ఒక్కరైనా కాసింత కష్టపడితే చాలు సునాయాసంగా ఐదేళ్ల పాటు పార్లమెంటు సభ్యులుగా కొనసాగారు. అయితే ఈ సారి పరిస్థితుల్లో మార్పులు సంభవించాయి. ప్రధాని నరేంద్రమోడీకి అప్పట్లో వున్న మ్యానియా ఇప్పుడు లేదు. కొందరు నోట్ల రద్దుపై వారి వ్యతిరేకతను కనబరుస్తుండగా.. తమ భోజనన్ని కూడా ప్రధాని మోడీ టార్గట్ చేస్తున్నాడని మరికొందరు అరోపణలు వస్తున్నాయి.

ఈ క్రమంలో ఉత్తర్ ప్రదేశ్ లోని మొరాదాబాద్ బీజేపి పార్లమెంటు ఈసారి ఎన్నికల్లో పోటీ చాలా తీవ్రంగా ఉందని, తాను గెలవడం కష్టమేనని ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కున్వర్ సర్వేశ్ కుమార్ సింగ్ వాపోయారు. ఆయన బరిలో ఉన్న మొరాదాబాద్‌లో 47 శాతం మంది ముస్లిం ఓటర్లు, జాతవ్ లు 9 శాతం ఉండడమే ఆయన ఆవేదనకు కారణం. ఇక ముస్లిం ఓట్లతో మొరాదాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఈ సారి ఎలాగైనా జెండా ఎగురవేసేందుకు కాంగ్రెస్ బలమైన అభ్యర్థి ఇమ్రాన్ ప్రతాప్ గర్హీ బరిలోకి దింపింది. కవిగా కేంద్రం, రాష్ట్ర ప్రజావ్యతిరేక విధానాలపై ఆయన తన కవిత్వాలతో పాటు పదునైన వ్యాఖ్యలతో విమర్శిస్తూ వుంటారు.

ఇక ఎస్సీ-బీఎస్సీ కలసి పోటీకీ దిగుతున్న నేపథ్యంలో వారు కూడా ఎస్ టి హసన్ అనే ఒక ప్రముఖ డాకర్ట్ ను రంగలోకి దింపింది. గత ఎన్నికల్లో పోటీకి దిగిన కున్వర్ విజయం సాధించారు. అప్పట్లో సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీలు వేర్వేరు అభ్యర్థులను నిలబెట్టడంతో ఓట్లు చీలిపోయి స్వల్ప మెజారిటీతో కున్వర్ విజయం సాధించారు. తాజా ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. గత ఎన్నికల్లో కున్వర్ చేతిలో ఓడిన హసన్ మళ్లీ ప్రత్యర్థిగా మారారు. ఈసారి ఓట్లు చీలే అవకాశం లేకపోవడంతో తన ఓటమి ఖాయంగా కనిపిస్తోందని కున్వర్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Moradabad  Lok Sabha Election 2019  Sarvesh Kumar Singh  BJP  SP-BSP  Congress  Politics  

Other Articles