miraculous survival after being thrown off flyover ఫ్లయ్ ఓవర్ పై నుంచి ఎగిరిపడింది.. కానీ..!

Woman on bike miraculously survives after being thrown off flyover

Woman miraculous survival, Accident on vikaspuri flyover, shocking CCTV Footage, accident on Flyover, Vikaspuri accident, Delhi accident, delhi flyover accident, miraculous survival, delhi vikaspuri accident, woman fall of flyover, woman survives in delhi, Woman, Accident, CCTV Footage, Flyover, Vikaspuri, Delhi, crime

In a shocking incident that took place in Delhi, a 20-year-old woman on a bike, miraculously survived after she was thrown off the flyover in Vikaspuri. The woman was riding pillion on a bike, when got hit by a speeding vehicle and lost balance.

ITEMVIDEOS: ఫ్లయ్ ఓవర్ పై నుంచి ఎగిరిపడింది.. కానీ..!

Posted: 02/20/2019 12:35 PM IST
Woman on bike miraculously survives after being thrown off flyover

అదృష్టం బాగుందంటే.. కాలకూట విషం కూడా అమృతంగా తయారవుతుందని.. పెద్దలు చెప్పిన మాట.. అక్షరాల నిజమైంది. అకస్మాత్తుగా వెనుకనుంచి వేగంగా వస్తున్న వాహనం ఢీకొనడంతో.. అదుపు తప్పి గాల్లోకి ఎగిరిన యువతి.. ఏకంగా ఫ్లయ్ ఓవర్ పైనుంచి కింద రోడ్డుపైపడినప్పటికీ మృత్యుంజయులు రాలిగా మారింది. ఈ ఘటన న్యూఢిల్లీలోని వికాస్ పురిలో జరుగింది. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అన్ లైన్ లో పెట్టగా, అదికాస్తా నెట్టింట్లో  ఇప్పుడు వైరల్ అవుతోంది.

పశ్చిమ ఢిల్లీ డీసీపీ మోనికా భరద్వాజ్‌ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఘటనలో ఫై ఓవర్ పైనుంచి కింద పడిన అమ్మాయి.. సప్న(20) అనే యువతికి స్వల్పగాయాలతో బయటపడింది. ఘటన వివరాల్లోకి వెళ్తే.. తన మిత్రుడిని కలిసే నిమిత్తం మోటార్ సైకిల్‌ పై పశ్చిమ విహార్‌ నుంచి జనక్‌ పురికి ఇద్దరు స్నేహితులతో కలిసి సప్న వెళుతున్న వేళ ఈ ప్రమాదం జరిగింది. కునాల్ అనే మిత్రుడు వాహనం నడుపుతూ ఉండగా, మధ్యలో జియో, వెనుక సప్న ఉన్నారు. వికాస్‌ పురి ఫ్లయ్ ఓవర్‌ పై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన మరో మోటారు సైకిల్‌ వారిని ఢీకొంటూ వేగంగా వెళ్లిపోయింది.

ఈ ప్రమాదంలో కునాల్, జియో ఫ్లయ్ ఓవర్ బారియర్ ను ఢికొన్నారు. దీంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో అదే వాహనంపై కూర్చున్న సప్న.. ప్రమాదం సంభవించడంతో ఏకంగా గాలిలోకి ఎగిరింది. అలా ఎగురుతూనే కిందనున్న రోడ్డుపై పడింది. ఆ సమయంలో అటుగా ఏ వాహనమూ రాలేదు. ఈ ఘటనను చూసిన స్థానికులు ఆమెను, ఆమె మిత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించామని పోలీసులు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Woman  Accident  miraculous survival  CCTV Footage  Flyover  Vikaspuri  Delhi  crime  

Other Articles