UPSC 2019: Registration for IAS, IFS Exam Starts యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ ధరఖాస్తుల స్వీకరణ షురూ..!

Upsc civil services 2019 registration begins candidates can apply for ias ifs exam

Civil Services Examination, IAS, IFS, IPS, union public service commission, UPSC, UPSC 2019, upsc.gov.in, online registration

The Union Public Service Commission (UPSC) issued a notification regarding online registration process for civil services examination (CSE) 2019. The statement was released on its official website at upsc.gov.in

యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ ధరఖాస్తుల స్వీకరణ షురూ..!

Posted: 02/20/2019 11:51 AM IST
Upsc civil services 2019 registration begins candidates can apply for ias ifs exam

ప్రజా సేవ చేయడం.. అందునా రాజకీయాలకు అతీతంగా ప్రజల సంక్షేమాన్ని కాంక్షించే తత్పరులా.? మీ టార్గెట్ ఇండియన్ సివిల్ సర్వీసెన్ లో స్థానం పొందడమేనా.? ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఇలా అనునిత్యం ప్రజల మధ్య వుంటూ.. వారి సంక్షేమమే మీ సంక్షేమం అని భావించేవారా.? ప్రజలకు ప్రభుత్వాలు చేకూర్చిన లబ్దిని తీసుకెళ్లే బృహత్తర బాధ్యతను భుజస్కంధాలపై వేసుకుని వారిని అభివృద్ది పథంలో భాగస్వాములను చేయడమే మీ లక్ష్యమా.? అయితే ఇక అలస్యమెందుకు మీరు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్-2019కి ప్రిపేర్ కావాల్సిందే.

యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్-2019 దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. మార్చి 18 వరకు ఆశావాహ అభ్యర్థులు దరఖాస్తు చేయొచ్చు. 2019 జూన్ 2న ప్రిలిమినరీ లెవెల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఆశావాహులు ఆన్‌లైన్ పరీక్షకు దరఖాస్తు చేయొచ్చు. యూపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ అయిన upsc.gov.in లో ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేయాల్సి ఉంటుంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవాళ్లు UPSC CSE 2019 పరీక్షకు దరఖాస్తు చేయొచ్చు.

యూపీఎస్‌సీ రిక్రూట్ మెంట్ ప్రక్రియ మూడు లెవెల్స్ లో ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. మూడు లెవెల్స్ లో క్వాలిఫై అయినవారినే ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. జూన్ 2న నిర్వహించే యూపీఎస్‌సీ ప్రిలిమ్స్‌లో పాసైన వారికి సెప్టెంబర్ 20 నుంచి ఐదు రోజుల వరకు మెయిన్స్ పరీక్షలు ఉంటాయి. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(IFS) మెయిన్స్ పరీక్షలు 2019 డిసెంబర్ 1న నిర్వహిస్తారు. ఐఎఫ్ఎస్ పరీక్షలు 10 రోజుల పాటు ఉంటాయి. మెయిన్స్ లో పాసైనవారికి ఇంటర్వ్యూలు ఉంటాయి.

యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షలో రెండు పేపర్లు(జనరల్ స్టడీస్ పేపర్-1, జనరల్ స్టడీస్ పేపర్-2) ఉంటాయి. ప్రతీ పేపర్ కు 200 మార్కులు. మల్టిపుల్ ఛాయిస్, ఆబ్జెక్టీవ్ టైప్ ప్రశ్నలుంటాయి. మెయిన్స్ పరీక్షలకు ప్రిలిమ్స్ క్వాలిఫికేషన్ తప్పనిసరి. ప్రిలిమ్స్ లో సాధించిన మార్కుల్ని ఫైనల్ ర్యాంకింగ్ లో పరిగణలోకి తీసుకోరు. మెయిన్స్ లో 1750 మార్కులు, ఇంటర్వ్యూలో 275 మార్కులుంటాయి. మెయిన్, ఇంటర్వ్యూ రౌండ్ లో మార్కులను బట్టి మెరిట్ స్కోర్ ఇస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Civil Services Examination  IAS  IFS  IPS  union public service commission  upsc.gov.in  

Other Articles