Will never go back to era of ballot papers: ECI ఈవీఎంలకే ఓటు.. పాత రోజులకు వెళ్లలేమన్న సీఈసీ..

Evm row not going back to ballot papers says cec sunil arora

Chief Election Commissioner, CEC Sunil Arora, Election commission of India, chief election officer, Evms, Electronic Voting Machines, VVPAT Machines, EVM hacking, EVM tampering, VVPAT slips counting, Kapil Sibal, sayeed shuja, Politics

Chief Election Commissioner Sunil Arora on Thursday said there is no way the country will be "intimidated, bullied or coerced" into giving up electronic voting machines (EVMs), reports say.

ఈవీఎంలకే ఓటు.. పాత రోజులకు వెళ్లలేమన్న సీఈసీ..

Posted: 01/24/2019 02:14 PM IST
Evm row not going back to ballot papers says cec sunil arora

ఎన్నికల్లో ఉపయోగించే ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు(ఈవీఎం)లను హ్యాకింగ్‌ చేయొచ్చని, 2014 ఎన్నికల్లో ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన బీజేపి పార్టీ ఈవీఎం ట్యాపరింగ్ ద్వారానే అధికారంలోకి వచ్చిందని అమెరికాలో ఆశ్రయం పోందుతున్న సైబర్‌ నిపుణుడు, ఈవీఎం యంత్రాల తయారీ సాంకేతికతలో పాలుపంచుకున్న మాజీ ఈసీఐఎల్ ఉద్యోగిగా చెప్పుకున్న సయ్యద్‌ షుజా అరోపణల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెనురాజకీయ దుమారం రేగింది.

ప్రతిపక్షంలోని అనేక పార్టీలు సయ్యద్ షుజా అరోపణలపై నిజనిజాలను వెలికితీయాల్సిన అవసరం వుందని అంటూనే.. ఈ విషయంలో స్పష్టత వచ్చే వరకు ఈవీఎంలకు బదులుగా పాతరోజుల్లో వినియోగించిన పేపర్‌ బ్యాలెట్లు విధానాన్నే వినియోగించాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. దీంతో సయ్యద్ షుజా చేసిన ఆరోపణలను ఖండించిన కేంద్ర ఎన్నికల కమీషనర్ సునీల్ అరోరా.. రెండు దశాబ్దాలు దాటినా ఇంకా ఈవీఎంలపై అరోపణలు రావడం సహేతుకరం కాదని అన్నారు.

తిరిగి పేపర్‌ బ్యాలెట్లకు వెళ్లే ప్రసక్తే లేదని, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలనే ఉపయోగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సునిల్‌ అరోరా తాజా వివాదం గురించి స్పందిస్తూ.. ‘తిరిగి కాగితం బ్యాలెట్ల రోజులకు వెళ్లే ప్రసక్తే లేదు. మేం ఈవీఎంలనే కొనసాగిస్తాం. 2014 నుంచి ఇప్పటివరకు అనేక ఎన్నికలు జరిగాయి. కొందరు గెలిచారు. కొందరు ఓడిపోయారు. గెలిచిన వారికి ఈవీఎంలు మంచివే. ఓడిపోయిన వారు అవి సరిగా లేవని అంటారని పేర్కోన్నారు.

రాజకీయ పార్టీల చేతుల్లో ఈవీఎంలేం ఫుట్ బాల్‌ కాబోవని అన్నారు. దేశంలో రెండు దశబ్దాలుగా ఈవీఎంలను ఉపయోగిస్తున్నాం. రాజకీయ పార్టీల డిమాండ్ల దృష్ట్యా ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు వీవీప్యాట్‌ యంత్రాలను కూడా తీసుకొచ్చామని సునిల్‌ అరోరా చెప్పుకొచ్చారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ ఈవీఎంలనే కొనసాగిస్తామని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఈవీఎంలపై ఎలాంటి విమర్శలు, వివాదాలను ఎదుర్కొనేందుకైనా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles