Unaccounted cash of Rs 6 crore seized in Nellore కారులో కరెన్సీ నోట్ల కట్టలు.. పోలీస్ ఛేజ్

Unaccounted cash of rs 6 crore seized in nellore

Rs 6 cr seize, Rs 6 cr cash, Rs 6 cr cash income tax, Rs 6 cr in car, Rs 6 cr in car police chase, police seize Rs 6 cr cash, Rs 6 cr in 2000 denomination, nellore, hawala money, thada, Andhra pradesh, Tamil Nadu, Andhra TN Border, Crime

The Andhra Pradesh police during a regular vehicle check found the unaccounted cash of Rs 6 crore in 2000 note denomination cash in a car near Thada village in Nellore district at Andhra Pradesh and Tamil Nadu border.

కారులో రూ.2000 కరెన్సీ నోట్ల కట్టలు.. పోలీసుల ఛేజ్

Posted: 01/24/2019 01:30 PM IST
Unaccounted cash of rs 6 crore seized in nellore

ఆంధ్ర-తమిళనాడు సరిహద్దులో ఓ కారు వేగంగా వెళ్లడాన్ని గమనించిన పోలీసులు దాని ఛేజ్ చేశారు. అయితే పోలీసుల వెంటవస్తున్నారని గమనించిన కారులోకి వ్యక్తలు మరింతగా వేగాన్ని పెంచారు. కట్ చేస్తే కారును ఛేజ్ చేసిన పోలీసులు దానిని అపి తనిఖీలు చేయడంతో షాక్ తిన్నారు. కారులో రెండేవేల రూపాయల కట్టలకొద్ది డబ్బు లభ్యమైంది. ఏకంగా 6.5 కోట్ల రూపాయల డబ్బును స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇందుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

ఈ ఘటన ఆంధ్ర తమిళనాడు సరిహద్దులోని నెల్లూరు జిల్లా తడ వద్ద చోటుచేసుకుంది. డబ్బును ఆదాయపన్నుశాఖ అధికారులకు అప్పగించిన పోలీసులు ఇదంత హవాలా డబ్బుగా అనుమానిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి కారులో ఇద్దరు వ్యక్తులు చెన్నై వైపుగా వెళ్తున్నారు. ఎస్సై దాసరి వెంకటేశ్వరరావు సూళ్లూరుపేట నుంచి వస్తూ చేనిగుంట వద్ద ఓ కారు వేగంగా వెళ్తుండడాన్ని గమనించారు.

కారులోని డ్రైవర్, మరో వ్యక్తి కంగారుగా ఉన్నట్టు అనిపించడంతో అనుమానం వచ్చిన ఎస్సై కారును ఛేజ్ చేసి తడ వద్ద కారును ఆపారు. అనంతరం కారును క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులు అందులో కుప్పలు తెప్పలుగా బయటపడిన కరెన్సీ నోట్లను చూసి ఆశ్చర్యపోయారు. సీట్ల కింద, డిక్కీలో రూ. 500, రూ. 2000 నోట్ల కట్టలు బయటపడ్డాయి. వెంటనే కారును పోలీస్ స్టేషన్ కు తరలించి ఆదాయపు పన్ను శాఖ అధికారులకు సమాచారం అందించారు.

విదేశీకరెన్సీతో కలిపి మొత్తం రూ.6.5 కోట్లుగా ఆ డబ్బును లెక్కగట్టారు. అలాగే, నిందితుల నుంచి 55 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మాచినీడు కనక సురేశ్, చేమకూరి హరిబాబుగా పోలీసులు గుర్తించారు. నరసాపురానికి చెందిన జైదేవి నగల వ్యాపారి ప్రవీణ్ కుమార్ జైన్ ఆదేశాలతోనే తాము నగదును చెన్నై తరలిస్తున్నట్టు నిందితులు చెప్పారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rs 6 cr seize  Rs 6 cr cash  Rs 6 cr cash income tax  Rs 6 cr in car  Thada  Andhra TN Border  Crime  

Other Articles