TRS will come to power says asaduddin owaisi బైక్ పై ప్రగతిభవన్ కు అసద్.. కారుదే మళ్లీ అధికారమన్న ఎంఐఎం నేత

Trs will form govt in telangana on its own asaduddin owaisi

telangana elections 2018, Telangana assembly elections, Asaduddin Owaisi says TRS will come to power, akbaruddin owaisi, TRS, K Chandrashekar Rao, Congress, Maha kutami, Telangana Politics

Hyderabad Member of parliament and AIMIM president Asaduddin Owaisi confidently says that TRS party will come into power on its own once again, if requries their party will extend support.

ITEMVIDEOS: తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీదే మళ్లీ అధికారమన్న అసద్..

Posted: 12/10/2018 03:18 PM IST
Trs will form govt in telangana on its own asaduddin owaisi

తెలంగాణ అపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత మెజారిటీతో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ఆల్ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ధీమా వ్యక్తం చేశారు. దేవుడి దయతో కేసీఆర్ మరోమారు తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతారని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల అశీర్వాదంతో ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలను చేపడుతారని నమ్మకం వుందని అన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన పక్షంలో తాము మద్దుతుగా నిలుస్తామని అన్నారు.

‘తెలంగాణ ఆపద్ధర్మ, కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ సాహెబ్ ను ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు కలుసుకోబోతున్నా. ఇన్షా అల్లాహ్.. ఆయన సొంత మెజారిటీతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఆయనకు అండగా మజ్లిస్ పార్టీ ఉంటుంది. దేశ నిర్మాణం అనే గొప్ప లక్ష్యం కోసం మేం వేస్తున్న తొలి అడుగు ఇది’ అని ట్వీట్ చేశారు. టీఆర్ఎస్ కు ఒకవేళ పూర్తిస్థాయి మెజారిటీ రాకపోతే తాము ఆ పార్టీ ప్రభుత్వ ఏర్పాటులో మద్దతుగా నిలుస్తామని చెప్పారు.


టీఆర్ఎస్ ప్రభుత్వానికి మజ్లిస్ పార్టీ మద్దతుగా ఉంటుందని వ్యాఖ్యానించిన ఆయన.. టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలవడం ద్వారా దేశనిర్మాణంలో తొలి అడుగు వేస్తున్నామని వెల్లడించారు. కనుక తమ మద్దతు విషయంలో డిప్యూటీ ముఖ్యమంత్రి పదవితో పాటు రెండు మంత్రి పదవులను అసద్ కోరనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ వ్యూహాత్మక భేటీ అనంతరం ఇరువురు నేతలు సంయుక్తంగా మీడియా ముందుకు రానున్నారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Asaduddin Owaisi  TRS  Akbaruddin owaisi  KCR  Congress  Maha kutami  Telangana Politics  Telangana Politics  

Other Articles