Nageshwar Rao Appointed as CBI Chief తక్షణం విధుల్లో చేరాలని సీబీఐ తాత్కలిక డైరెక్టర్ కు అదేశం

Government appoints m nageshwar rao as interim cbi chief

CBI, nageshwar rao, bribery allegation, alok sharma, rajesh asthana, Central Bureau of Investigation, CBI, deputy SP, Devender Kumar Singh, bribery allegation, Arrest, CBI Special Director, Rakesh Asthana, meat exporter, Moin Qureshi. middleman, PM Modi, PMO Office, summons, Amit shah, Odisha, Crime

The government on Wednesday divested Central Bureau of Investigation ( CBI) chief Alok Verma of his charge and Joint Director M. Nageshwar Rao was asked to take charge as interim chief.

తక్షణం విధుల్లో చేరాలని సీబీఐ తాత్కలిక డైరెక్టర్ కు అదేశం

Posted: 10/24/2018 12:10 PM IST
Government appoints m nageshwar rao as interim cbi chief

సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ గా నియమితులైన తెలుగుతేజం, ఐపీఎస్ అధికారి మన్నెం నాగేశ్వరరావును తక్షణం విధుల్లో చేరాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. మోదీ సూచనల మేరకు నియామకపు ఉత్తర్వులు వెలువరించిన డీవోపీటీ, నాగేశ్వరరావును ఇవాళే విధులను స్వీకరించాలని కోరింది. తక్షణమే ఆయన నియామకం అమల్లోకి వచ్చినట్టని డీవోపీటీ పేర్కొంది. దేశవ్యాప్తంగా అవినీతి అధికారులను గడగడలాడించాల్సిన ఆ సంస్థ అధికారులే అవినీతి అరోపణల్లో కూరుకుపోయారు.

దీంతో సీబిఐని ప్రక్షాళన చేయాలని భావించిన ప్రధాని నరేంద్రమోడీ ఏ మాత్రం ముందస్తు ఊహాగానాలకు తావివ్వకుండా ప్రస్తుతం డైరెక్టర్ అలోక్ వర్మను రాత్రికి రాత్రే మార్చారు. సీబీఐకి తాత్కాలిక డైరెక్టర్ గా మన్నెం నాగేశ్వరరావును నియమిస్తూ గత అర్ధరాత్రి ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. విజయరామారావు తరువాత సీబీఐ డైరెక్టర్ గా నియమితుడైన మరో తెలుగు వ్యక్తి నాగేశ్వరరావే కావడం గమనార్హం. గడచిన ఏడాదిన్నరగా సీబీఐలో జాయింట్ డైరెక్టర్ గా ఉన్న ఆయన, తెలంగాణలోని వరంగల్‌ జిల్లా మండపేట మండలం బోర్ నర్సాపూర్‌‌ కు చెందిన వారు.

కాగా, సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ, ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ ఆస్థానా మధ్య కొనసాగిన వర్గ పోరుతో సీబీఐ పరువు బజారున పడగా, ఇద్దరినీ పిలిచి వివరాలు తెలుసుకున్న ప్రధాని మోడీ.. వారిపై సీరియస్ అయ్యారు. ఆ తరువాత రాకేశ్ అస్థానా ముడుపులు తీసుకున్నారని కేసు బనాయించి.. ఢిప్యూటీ ఎస్పీ కుమార్ ను అరెస్టు చేసిన డైరెక్టర్ అలోక్ వర్మనుపై చర్యలు కూడా తీసుకున్నారు. ఆయనను ఆ స్థానం నుంచి తప్పించి.. సెలవుపై పంపారు. ఆపై ఆగమేఘాలపై ఫైళ్లను కదిలించి, నాగేశ్వరరావును తాత్కాలిక డైరెక్టర్ గా నియమించడం జరిగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CBI  nageshwar rao  bribery allegation  alok sharma  rajesh asthana  meat exporter  Moin Qureshi  Odisha  Crime  

Other Articles