Anonymous bomb threat to Mani Ratnam దర్శకుడు మణిరత్నానికి బాంబు బెదిరింపులు..

Mani ratnam s office gets threat call demanding removal of dialogues

Mani Ratnam office, hoax call, bomb threat call, Chekka Chivantha Vaanam, Nawab, dialogues, Removal, chennai police, crime

Director Mani Ratnam lodged a police complaint about a hoax bomb threat call which was received at his office at Abiramapuram in Chennai.

దర్శకుడు మణిరత్నానికి బాంబు బెదిరింపులు..

Posted: 10/02/2018 01:25 PM IST
Mani ratnam s office gets threat call demanding removal of dialogues

లెజండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో రూపోందిన తమిళనాట హిట్ టాక్ తో త్వరలోనే రూ.50 కోట్ల క్లబ్ లో చేరనున్న భారీ చిత్రం నవాబ్. సినిమా హిట్ కావడంలో సంతోషంగా వున్న మణిరత్నంకు సోమవారం రాత్రి ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. మణిరత్నం ఆఫీసుకు ఫోన్ చేసిన ఓ దుండగుడు.. బాంబు బెదిరింపు వుందని హెచ్చరిస్తూ కాల్ చేయడం కాలీవుడ్ లో కలకలం రేపుతుంది.

తెలుగులో ‘నవాబ్’ టైటిల్ తో వచ్చిన చిత్రాన్ని తమిళంలో ‘చెక్క చీవంత వానమ్’ అనే టైటిల్ తో ఈ నెల 27నే విడుదల చేశారు. అయితే ఈ చిత్రంలో పలు అభ్యంతరకర డైలాగ్‌లు తొలగించాలని డిమాండ్ చేస్తూ మణిరత్నం కార్యాలయానికి దుండగుడు ఫోన్ చేసినట్లు సమాచారం. డైలాగులను తొలగించని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీంతో మణిరత్నం పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు దర్యాప్తును ప్రారంభించారు.

కాగా ప్రకాశ్ రాజ్, జయసుధ, అరవింద్ స్వామి, శింబు, విజయ్ సేతుపతి, అరుణ్ విజయ్‌, ఐశ్వర్యా రాజేశ్, జ్యోతిక, అదితీరావు హైదారీ, డయానా తదితర భారీ తారాగణంతో ఇటీవల మణిరత్నం ‘చెక్క చీవంత వానమ్’(తెలుగులో నవాబ్) అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. రివేంజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది. అంతేకాదు బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోన్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mani Ratnam office  hoax call  bomb threat call  Nawab  media  kollywood  crime  

Other Articles