Leaders pay homage to Mahatma గాంధీజీ 150వ జన్మదినం.. జాతిపితకు దేశం ఘననివాళి..

Nation celebrates mahatma gandhi s 150th birthday

Mahatma Gandhi, Gandhiji, Gandhi Jayanthi, Gandhi jayanti, lal bahadur shashtri, President, RamNath Kovind, PM Modi, Sonia Gandhi, Rahul Gandhi, political Leaders, Nation pays homage to mahatma

October 2, this year marks the beginning of 150th birth anniversary celebrations of Mahatma Gandhi. Today, also marks the birth anniversary of former Prime Minister Lal Bahadur Shastri.

గాంధీజీ 150వ జన్మదినం.. జాతిపితకు దేశం ఘననివాళి..

Posted: 10/02/2018 12:43 PM IST
Nation celebrates mahatma gandhi s 150th birthday

తెల్లవారి కబంధ హస్తాల నుంచి భరతమాత దాస్య శృంఖలాలను తెంచిన మహనీయుడు ఆయన! శాంతియుత మార్గంలోనే రక్తం చిందకుండా యావత్ దేశప్రజలను ఏకతాటిపై నడిపించిన మహానాయకుడు ఆయన! భారత గడ్డకు స్వేచ్ఛావాయువులు ప్రసాదించి.. మూడు వందల ఏళ్లకు పైగా కమ్ముకున్న చీకట్లను పారదోలి.. వెలుగురేఖలను ప్రసరింపజేసిన ధీశాలి! ప్రపంచానికి ‘అహింస’, ‘శాంతి’ని ఆయుధాలుగా అందించిన మార్గదర్శి! ఆయనే జాతిపిత మహాత్మాగాంధీ.  

ఆ యుగపురుషుని 150వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు భరతజాతి సంసిద్ధ మైంది. మంగళవారం దేశ వ్యాప్తంగా ఘనంగా వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి. మహాత్ముడిని తలచు కుంటూ ఈ ఏడాదంతా జయంతి వేడుకలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. మహా త్ముడు ప్రవచించిన శుభ్రత, పారి శుధ్యం అనే భావనను మరింత ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇప్పటికే ‘స్వచ్ఛ భారత్’ను ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం.. ఈ నెల 15 నుంచి ‘స్వచ్ఛతాహి సేవ’ కార్యక్రమాన్ని చేపట్టనుంది.

గాంధీజీ 150వ జయంతిని పురస్కరించుకుని రాజ్ ఘాట్ చేరుకున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జాతిపితకు ఘన నివాళులు అర్పించారు. అంతకుముందు ప్రధాని నరేంద్రమోడీ.. కేంద్రమంత్రులు. అఖిలభారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియాగాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మరెందరో రాజకీయ నేతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు జాతిపితకు ఘనంగా నివాళులు అర్పించారు. అటు దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రముఖులు, ప్రజలు కూడా గాంధీజీ సేవలను గుర్తుచేసుకున్నారు.

స్వచ్ఛత కార్యక్రమాన్ని ఉద్యమంగా చేపట్టాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ‘ఆయన జీవితమే ఓ సందేశం’ ..అంటూ మహాత్ముడిని స్మరించుకుంటూ వివిధ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు సంస్థలు, ప్రభుత్వ సంస్థలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నాయి.  మహాత్ముని 145వ జయంతి రోజున చేపట్టిన ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని.. జాతిపిత 150వ జయంతికి పూర్తి చేయనున్నట్లు అప్పట్లో ప్రధాని మోడీ ప్రకటించారు.

కాగా, గాంధీజీ అంటే కదల్లేని విగ్రహం కాదని.. దేశమంతా విస్తరించిన విలువలు, జీవించి ఉన్న ఆలోచనలు అని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ఈ మేరకు ట్విటర్లో స్పందించిన ఆయన.. ‘గాంధీజీ అంటే కదలలేని విగ్రహం కాదు, దేశమంతా విస్తరించి ఉన్న విలువలు, జీవించి ఉన్న ఆలోచనలు. సత్యం, అహింస.. వీటి కోసమే ఆయన జీవించారు, దేశం కోసం చనిపోయారు. నిజమైన దేశ భక్తులు ఆయన విలువలను కాపాడాలి’ అని కోరారు. బీజేపి అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ, ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ తదితర ప్రముఖులు మహాత్మునికి నివాళులర్పించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles