Congress accuses BJP of promoting crony capitalism దేశవ్యాప్తంగా కొనసాగుతున్న భారత్ బంద్

Aap sharad pawar join rahul gandhi in capital in bharat bandh

bharat bandh, bharat bandh on rupee fall, bharat bandh on raising petrol prices, bharat bandh 2018, bharath band, petrol price protest, congress protest, congress bharat bandh, opposition parties bharat bandh, bharat bandh latest news, bharat bandh news, bharat bandh updates

Congress chief Rahul Gandhi kickstarted the party’s call for a nationwide shutdown from Rajghat, which has been called to protest against the rising fuel prices as well as the fall in the value of the Rupee.

దేశవ్యాప్తంగా ప్రశాంతంగా ప్రతిపక్షాల భారత్ బంద్..

Posted: 09/10/2018 10:44 AM IST
Aap sharad pawar join rahul gandhi in capital in bharat bandh

జీవితకాల రికార్డుతో ముందుకుసాగుతూ.. వాహనదారులపై పెనుభారం మోపుతున్న చమురు ధరలకు నిరసనగా కాంగ్రెస్‌ నేతృత్వంలో ప్రతిపక్షాలు చేపట్టిన ‘భారత్‌ బంద్‌’ చెదరు మదురు సంఘటనలు మినహా దేశవ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ప్రతిపక్షాల పార్టీల నాయకులు, కార్యకర్తల నేతృత్వంలో బంద్ కొనసాగుతుంది. పలు రాష్ట్రాల్లో కొందరు అందోళనకారులు రైల్ రోకోను చేపట్టగా, కొన్ని చోట్ల రాస్తారోకోలు కూడా నిర్వహించారు. బిహార్ లో అందోళనకారులు ఓ పెట్రల్ బంక్ పై విరుచుకుపడి దాన్ని ధ్వంసం చేశారు.

ఓ వైపు అంతకంతకూ పెరుగుతున్న ఇంధన ధరలు, మరోవైపు రూపాయి పతనం ఏకంగా పాతాళాన్ని చూస్తున్న క్రమంలో ప్రతిపక్షంలోని కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చింది. ఇందుకు బీజేపి, ఎన్డీయేతర పార్టీలు మద్దతు పలకాలని కోరింది. దీంతో దేశంలోని రమారమి అన్ని ప్రతిపక్ష పార్టీలు ఈ బంద్ కు మద్దతు పలికి.. బంద్ లో పాల్టోంటున్నాయి. ఈ క్రమంలో పలు చోట్లు చెదరుమదురు ఘటనలు జరిగినట్లు సమాచారం. బంద్ నేపథ్యంలో పాట్నాలో అందోళనకారులు రెచ్చిపోవడంతో పోలీసులు అక్కడ అప్రకటిత కర్ఫ్యూ వాతవరణం అలుముకున్నట్లు సమాచారం.

ఇక ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో భారత్ బంద్ చేపట్టేందుకు వచ్చిన రాజ్ ఘాట్ లోని మహాత్మాగాంధీ సమాధి వద్దకు చేరుకున్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయనకు తన ఘనంగా నివాళులు అర్పించి అంజలి ఘటించారు. ఆనంతరం అక్కడే స్థానికంగా ఏర్పాటు చేసిన సభాస్థలి వద్వకు చేరుకున్నారు. రాహుల్ గాంధీతో పాటు యూపీఏ ఛైర్ పర్సన్‌ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌, ఎల్జేడీ నేత శరద్‌ యాదవ్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్‌ సింగ్‌ సహా పలువురు కాంగ్రెస్‌ నేతలు నిరసనలో పాల్గొన్నారు.

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోనూ బంద్‌ కొనసాగుతోంది. చత్తీస్ గఢ్ లో కాంగ్రెస్‌ కార్యకర్తలు ధరల పెంపుపై నిరసన ప్రదర్శనలు చేశారు. బిహార్‌ రాజధాని పాట్నాలో ఎల్జేడీ కార్యకర్తలు రైల్వే ట్రాక్ పైకి చేరి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అటు గుజరాత్ లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. ధరల పెంపునకు నిరసనగా రోడ్లపైకి చేరిన ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు బస్సులను అడ్డుకుంటున్నారు. దీంతో ట్రాఫిక్‌ నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బంద్‌ నేపథ్యంలో ముంబయి లోకల్‌ రైళ్ల రాకపోకలు కొంతసేపు నిలిచిపోయాయి. మరోవైపు బంద్‌ దృష్ట్యా కొన్ని రాష్ట్రాల్లో పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పలు ప్రాంతాల్లో పోలీసులు మోహరించారు. ఈ బంధ్ లో డీఎంకే, ఎన్సీపీ, ఆర్జేడీ, జేడీ(ఎస్‌) సహా 21 విపక్ష పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజ ప్రతినిధులు ఈ బంద్‌లో పాల్గొన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bharat bandh  rupee fall  petrol prices agitation  opposition parties  congress  latest news  

Other Articles