enquiry to find reason behind student suicide bid పాఠశాల టీచర్ల అతి.. బలవంతంగా రాఖీ కట్టించి..

Government enquiry to find teachers involvement in suicide bid of student

Dibakar Saha, Class XII student, Rakshabnadhan, affair, girl friend, insult, humiliation, Bharati Vidya Bhawan, teachers, Suicide, Ratan Lal Nath, investigation, government medical college, Agartala, Tripura Government

The Tripura government has ordered a separate enquiry against some teachers of a school for allegedly abetting the suicide of a Class XII student.

పాఠశాల టీచర్ల అతి.. బలవంతంగా రాఖీ కట్టించి..

Posted: 08/29/2018 07:09 PM IST
Government enquiry to find teachers involvement in suicide bid of student

రాఖీ పండగ పర్వదినాన్ని పురస్కరించుకుని ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఇద్దరు ఉపాధ్యయులు చేసిన అతి కాస్తా.. విద్యార్థి అత్మహత్యయత్నానికి కారణమైంది. ప్రస్లుతం బాధిత విద్యార్థి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ అస్పత్రిలో చికిత్స పోందేందుకు కూడా కారణమైంది. తన గర్ల్ ఫ్రెండ్ తో రాఖీ కట్టించిన ప్రిన్సిఫల్, ఇద్దరు టీచర్ల వ్యవహారంతో తనకు అవమానం జరిగిందన్న భాధ, మనోవేధనతో ఓ విద్యార్థి ఏకంగా స్కూల్ బిల్డింగ్ పైకి ఎక్కి అక్కడి నుంచి కిందకు దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 18 సంవత్సరాల విద్యార్థి తీవ్రంగా గాయపడిన ఘటన అగర్తాలలో చోటుచేసుకుంది.

ఈ ఘటనలో ప్రధానోపాధ్యాయురాలు, ఇద్దరు టీచర్ల పాత్ర అధికంగా వుందని, బాధిత విద్యార్థి తల్లిదండ్రులు అరోపించారు. ప్రిన్సిఫాల్ గదిలో టీచర్ల అందరి సమక్షంలో తన జూనియర్ విద్యార్థినికి తమ కొడుకుతో బలవంతంగా రాఖీ కట్టించారని, అయితే ఈ చర్యలను తమ సున్నిత మనస్కుడైన అబ్బాయి జీర్ణించుకోలేడని తాము కూడా పదే పదే వద్దని వారిస్తున్నా వినిపించుకోని ప్రిన్సిపాల్. టీచర్లు వెంటపడి మరి కట్టించారని వారు అరోపించారు. అంతటితో అగకుండా ఓ టీచర్ ఏకంగా రాఖీ కడుతున్న దృష్యాలను తమ సెల్ ఫోనులో వీడియో కూడా తీశారని వారు అరోపించారు.

మరోమారు విద్యార్థినితో కలసి తిరిగినట్లు తెలిస్తే పాఠశాల నుంచి కూడా పంపేస్తామని వారు హెచ్చరించారని, అంతేకాకుండా ఈ ఘటన జరుగుతున్నప్పుడు పాఠశాల ఉపాధ్యాయులు కొందరితో పాటు 12వ తరగతి విద్యార్థులు కూడా అక్కడే వున్నారని కూడా అరోపించారు. కనీసం ప్రిన్సిపాల్ గది నుంచి వారిని పంపాలని తాను కోరినా.. అందరి సమక్షంలోనే రాఖీ కట్టాలని ఇది తప్పు కాదుగా అని వాదించినట్లు కూడా బాధిత విద్యార్థి తండ్రి చెప్పారు. ప్రిన్సిపాల్ రూం నుంచి బయటకు రాగానే తన తోటి స్నేహితులు వ్యంగంగా వ్యాఖ్యలు చేయడంతో మానసిక క్షోభకు గురైన తమ కొడుకు పాఠశాల భవనం ఎక్కి దూకేసాడని అవేదన వ్యక్తం చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దిలీప్‌ కుమార్‌ సాహా అనే 12వ తరగతి విద్యార్థి అదే పాఠశాలలో చదువుతున్న మరో యువతి ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రిన్సిపల్ తో పాటు కొందరు ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమక్షంలోనే ఆ యువతితో దిలీప్ కు రాఖీ కట్టించారు. ఇందుకు విద్యార్థులిద్దరు నిరాకరించారు. అయినప్పటికీ పాఠశాల యజమాన్యం ఒత్తిడి చేయడంతో యువకుడు వెంటనే పాఠశాల రెండో అంతస్తుకి వెళ్లి దూకేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఇతర విద్యార్థులు, తల్లిదండ్రులు పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. కాగా ప్రభుత్వం కూడా పోలీసు విచారణతో పాటు మరో విచారణను కూడా చేపట్టేందుకు ప్రభుత్వ అధికారులతో ఎంక్వైరీ కమిటీని వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles