defamation suit against Amit Shah in West bengal అమిత్ షా విద్వేషపూరిత ప్రసంగంపై దావా

Abhishek banerjee files defamation suit against amit shah

Amit Shah, kolkata, Mamata Banerjee, Chief Metropolitan Magistrate, defamation suit, AbhiShek Banerjee, Trinamool Congress, West Bengal, Politics

Trinamool Youth Congress chief Abhishek Banerjee, nephew of West Bengal chief minister Mamata Banerjee, filed a defamation suit against Amit Shah today, alleging that the BJP president has made slanderous statements against him at a public rally on August 11 in Kolkata.

అమిత్ షా విద్వేషపూరిత ప్రసంగంపై దావా

Posted: 08/29/2018 06:14 PM IST
Abhishek banerjee files defamation suit against amit shah

బీజేపి పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై పరువు నష్టం దావా దాఖలైంది. తన పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లే విధంగా.. ఆయన వ్యాఖ్యలు చేశారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ న్యాయస్థానంలో అమిత్ షాపై ఈ దావా వేశారు. అంతేకాకుండా తనపై విద్వేషపూరిత వ్యాఖ్యలు కూడా చేశారని తన గౌరవ మర్యాదలకు భంగం కలిగేవిధంగా అమిత్ షా మాట్లాడారని ఆరోపిస్తూ కోల్ కతాలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో అభిషేక్ బెనర్జీ ఈ పిటిషన్ వేశారు.

అభిషేక్ పిటీషన్ ను విచారణకు స్వీకరించిన కోల్ కతా చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులోని ఎనిమిదో న్యాయస్థాన ధర్మాసనం, అమిత్ షాకు సమన్లు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 28కి వాయిదా వేశారు. ఈ న్యాయస్థానంలో హాజరైన అభిషేక్ బెనర్జీ.. ఈ నెల 11న కోల్ కతాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ తనపై తప్పుగానూ, విద్వేష పూరితంగానూ మాట్లాడారని అభిషేక్ ఆరోపించారు.
 
ఆయన అభియోగాలను పరిగణలోకి స్వీకరించిన ఎనిమిదో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ స్పందిస్తూ అమిత్ షాకు నోటీసులు జారీ చేయమని అభిషేక్ కు చెప్పారు. పరువు నష్టం దావాపై విచారణ వచ్చే నెల 28న జరుగుతుందని తెలిపారు. ఈ నెల 11న పశ్చిమ బెంగాల్ పర్యటనకు వెళ్లిన అమిత్ షా.. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను అభిషేక్ బెనర్జీ దారి మళ్ళిస్తున్నట్లు అమిత్ షా చేశారు. అయితే ఈ ఆరోపణలు వాస్తవం కాదని అభిషేక్ స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amit Shah  Mamata Banerjee  defamation suit  AbhiShek Banerjee  Trinamool Congress  West Bengal  

Other Articles