Army jawan family left out of the NRC ఎన్ఆర్సీ డ్రాఫ్టులో అర్మీ జవానుకు స్థానం లేదా.?

Despite serving army for 30 years jawan left out from nrc draft

Assam, NRC draft, Mohammad A Haq, Indian Army, first draft, Final draft, March 25, 1971, india news, international news

Mohammad A Haq, who served for the Indian Army for 30 years, is upset with the government for not including his and his family's names in the recently announced final National Register of Citizens (NRC) draft.

ఆర్మీలో 30 ఏళ్లుగా దేశ సేవ చేసినా.. ఎన్ఆర్సీ ఇవ్వరా.?

Posted: 08/02/2018 06:10 PM IST
Despite serving army for 30 years jawan left out from nrc draft

అసోంలో ప్రకటించిన జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్నార్సీ) దాదాపు 40 లక్షల మందిని స్థానికులుగా గుర్తించకపోవడం అక్కడ తీవ్రమైన ఆందోళనకు కారణమవుతోంది. పేర్లు గల్లంతయిన వారిలో ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్మీ అధికారులతో పాటు సాక్షాత్తూ మాజీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ బంధువులు కూడా ఉండటంతో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.

తాజాగా భారత సైన్యంలో 30 ఏళ్ల పాటు సేవలు అందించిన ఓ అధికారి తన మొత్తం కుటుంబం వివరాలు ఎన్నార్సీ జాబితాలో గల్లంతు కావడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసోంకు చెందిన మొహమ్మద్ ఏ హక్ భారత సైన్యంలో 1986 నుంచి 2016 వరకూ జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్(జేసీవో)గా పనిచేశారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో అసోంలో ఇటీవల విడుదల చేసిన ఎన్నార్సీలో తనతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు గల్లంతు కావడంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

‘నేను భారత సైన్యంలో 30 ఏళ్లు పనిచేశాను. నాతో పాటు నా కుటుంబ సభ్యుల పేర్లు ఎన్నార్సీ జాబితాలో లేకపోవడంతో చాలా బాధ కలిగింది. నేను దేశం కోసం అంకితభావంతో పనిచేశాను. నా తల్లిదండ్రులకు సంబంధించిన వారసత్వ ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఈ ఘటనపై నిష్పాక్షిక విచారణ జరిపించాలి’ అని హక్ డిమాండ్ చేశారు. తన కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుందని ఆశిస్తున్నట్లు హక్ పేర్కొన్నారు. 1971, మార్చి 25కు ముందు అసోంలో ఉన్న స్థానికులు, వారి సంతానాన్ని మాత్రమే ఈ ఎన్నార్సీ జాబితాలో చేర్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Assam  NRC draft  Mohammad A Haq  Indian Army  first draft  Final draft  March 25  1971  india news  

Other Articles