Adultery law is anti-women, says Supreme Court ఐపీసీ సెక్షన్ 497 సవరణకు ‘‘సుప్రీం’’ అంగీకారం..

Arbitrary violative of right to equality sc s view on adultery law

Adultery,extramarital affair,Gender bias,gender neutral crime,IPC section 497,Marriage,NewsTracker,right to equality,Sex worker,Supreme Court,Women's rights, Nariman, Supreme Court, Adultery law, adultery, violative, Maharashtra, italy, europe

Justice D Y Chandrachud, who was part of a five-judge Constitution bench headed by Chief Justice Dipak Misra examining the penal law on adultery, also said that if a person indulge in an adulterous relationship then this itself was an indicator of a "broken marriage".

ఐపీసీ సెక్షన్ 497 సవరణకు ‘‘సుప్రీం’’ అంగీకారం..

Posted: 08/03/2018 11:55 AM IST
Arbitrary violative of right to equality sc s view on adultery law

భారత శిక్ష్మాస్మృతి సెక్షన్ 497ను సవరించేందుకు సుప్రీంకోర్టు సుముఖత వ్యక్తం చేసింది. వివాహితురాలైన మహిళ.. మరో వివాహిత పురుషుడితో సంబంధం పెట్టుకుని పట్టుబడితే, అమెను కేవలం బాధితురాలిగానే పరిగణించే విధానానికి కాలం చెల్లిందని, ఇక ఈ కేసులో స్త్రీ, పురుషులిద్దరికీ నేరం నుంచి విముక్తి కల్పించేలా సవరణలను చేయాలని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇంతకాలం పురుషుడికి ఐదేళ్ల వరకూ జైలు శిక్షను విధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ మహిళను కేవలం బాధితురాలిగా మాత్రమే పరిగణిస్తూ, ఎటువంటి కేసూ నమోదు చేసే వీలుండదు.

ఈ సెక్షన్ ను సవరించాలని దాఖలైన పిటిషన్ పై నిత్యమూ వాదనలు వింటున్న ఐదుగురు సభ్యుల అత్యున్నత ధర్మాసనం, సెక్షన్ ను మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఈ సెక్షన్ చెల్లుబాటును విచారించాలని షైనే జోసఫ్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు విన్న ధర్మాసనం, వివాహేతర సంబంధం స్త్రీ, పురుషుల అవసరార్థం ఏర్పడుతుందని, విడాకులు తీసుకోవాలని భావించే వారు మరొకరితో సంబంధం పెట్టుకుంటే చెల్లుబాటు అవుతుందని కోర్టు అభిప్రాయపడింది. ఆర్టికల్ 21 కింద వివాహేతర బంధాన్ని, పురుషుడు లేదా స్త్రీ తన జీవితానికి భరోసాను పొందే హక్కులో భాగంగా చూడవచ్చని జస్టిస్ నారిమన్ అభిప్రాయపడటం గమనార్హం.

ఇదే సమయంలో చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా మాట్లాడుతూ, "ఇది మహిళలకు రక్షణగా, వ్యభిచారానికి వ్యతిరేకంగా ఉన్నట్టు కనిపిస్తోందే తప్ప, వాస్తవానికి ఇది మహిళా వ్యతిరేక సెక్షన్. భర్త చెప్పుచేతల్లోనే భార్య ఉండాలని చెప్పకనే చెబుతోంది. మరో వ్యక్తితో సంబంధానికి భర్త అనుమతి తప్పనిసరని కూడా చెబుతున్నట్టు ఉంది" అని అన్నారు. ఈ విచారణ తరువాత కీలకమైన సెక్షన్ 497కు సవరణ అనివార్యమని పలువురు న్యాయ నిపుణులు అంచనా వేస్తుండగా, సీనియర్ న్యాయవాది మీనాక్షీ అరోరా, న్యాయవాదులు కాళీశ్వరన్ రాజు, సునీల్ ఫెర్నాండెజ్ తదితరులు ఆసక్తికర వాదనలు వినిపిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nariman  Supreme Court  Adultery law  adultery  violative  Maharashtra  italy  europe  

Other Articles