Sadhvi Prachi's controversial advice to Muslim women సాధ్వీ ప్రాచీ వివాదాస్పద వ్యాఖ్యలు..

Muslim girls should convert and marry hindu boys sadhvi prachi

Muslism, triple talaq, Nikah Halala, Sadhvi Prachi, ‘love jihad’, Bharatiya Janata Party (BJP), Mathura, Vishwa Hindu Parishad (VHP), Hinduism, Hindu boys, Ayodhya, Ram Temple

The VHP leader Sadhiv Prachi stirred a fresh row when she advised Muslim girls to convert and marry Hindu boys to save themselves from Islamic practices of triple talaq and Nikah-Halala.

ముస్లిం యువతులకు సాధ్వీ ప్రాచీ వివాదాస్పద ఫాఠాలు..!

Posted: 08/01/2018 01:29 PM IST
Muslim girls should convert and marry hindu boys sadhvi prachi

సంచలన వ్యాఖ్యలకు, కాంట్రావర్సీ కామెంట్లకు కేంద్ర బిందువైగా నిలిచే విశ్వ హిందూ పరిషత్(వీ హెచ్ పీ) నేత  సాధ్వి ప్రాచి.. మరోమారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు లవ్ జీహాద్ పేరిట ముస్లిం యువకులు హిందూ యువతులను పెళ్లాడకుండా పలు హిందూ సంస్థలు అడ్డుకోవడం.. తప్పదనుకుంటే పరమతం యువకులపై దాడులకు కూడా పాల్పడుతున్న క్రమంలో.. అమె ముస్లిం యువతులు మాత్రం తాము అనుభవిస్తున్న కష్టాలు దూరం చేసుకోవాలంటే హిందూ యువకులను పెళ్లాడాలని సూచించారు.

ముస్లిం అమ్మాయిలు హిందూ మతం స్వీకరించి హిందూ యువకులను పెళ్లాడాలని సాధ్వీ ప్రాచీ పిలుపునిచ్చారు. హిందూ యువకులను పెళ్లాడటం ద్వారా ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా వంటి దురాచారాల నుంచి వారు తేలిగ్గా బయట పడొచ్చన్నారు. మధుర లోని బంకే బిహారి ఆలయాన్ని సందర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. హిందూ మతాన్ని స్వీకరించడం ద్వారా ముస్లిం యువతులు అనేక వేధింపుల నుంచి బయటపడొచ్చని సూచించారు. హిందూ సంప్రదాయాల ప్రకారం మహిళలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం వుందని.. వారిని దేవతలుగా కొలిచే తత్వం కూడా వుందని అన్నారు.

కాగా, యూపీలోని ఓ దేవాలయంలోకి ఓ మహిళా ఎమ్మెల్యే వెళ్లినందుకు మందిరంలో గంగా జలంతో శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. బిడ్డకు జన్మనిచ్చేందుకు స్త్రీ కావాలి కానీ, దేవాలయంలో పూజలకు మాత్రం ఆమెకు అవకాశం ఉండదా? అని సాధ్వీ ప్రశ్నించారు. మహిళలపై ఇలాంటి వివక్ష ఉండకూడదని అభిప్రాయపడ్డాడు. అయోధ్యలో రామాలయం రాజకీయ అంశం కానేకాదని సాధ్వీ తెలిపారు. ఇది కోట్లాది హిందువుల నమ్మకానికి సంబంధించిన అంశమని ఆమె స్పష్టం చేశారు. రామాలయ నిర్మాణాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని తేల్చిచెప్పారు.

ఇక గోరఖ్ నాథ్ దేవాలయాన్ని దర్శించుకున్న అమె పనిలో పనిగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై కూడా వ్యాఖ్యలు చేశారు. గోరఖ్ నాథ్ ఆశీస్సుల కోసం క్రమం తప్పకుండా వస్తుంటానన్న అమె.. ఈసారి మాత్రం ఒక ప్రత్యేకమైన కోరికను కోరుకోవడానికి వచ్చానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీని కాంగ్రెస్ సాధించినా, లేకపోయినా.. కనీసం రాహుల్ గాంధీకి భార్య మాత్రం లభించాలని కోరుకున్నానని చెప్పారు. సాధ్వి ప్రాచి వ్యాఖ్యలపై యూపీ కాంగ్రెస్ నేత అశోక్ సింగ్ స్పందిస్తూ.. కాంగ్రెస్ నేతలను అవహేళన చేసే విధంగా మాట్లాడటం వారికి పరిపాటిగా మారిందని ఆయన విమర్శించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ, తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sadhvi Prachi  ‘love jihad’  Muslim girls  Hindu boys  Triple talaq  Nikah-halala  Hinduism  

Other Articles

Today on Telugu Wishesh