Union Minister Anupriya Patel eye-teasing ప్రధాని నియోజకవర్గంలో కేంద్ర మంత్రికి పోకిరీల వేధింపులు..

Anupriya patel s security breached three arrested in uttar pradesh

anupriya patel, Mirzapur, Eve teasing, Yogi Adityanath, Anti-Romeo squads, Varanasi, PM Modi, Uttar Pradesh

In a shocking incident, Union Minister Anupriya Patel became a victim of eve-teasing in Uttar Pradesh. The incident took place as the Minister of State (MoS), Ministry of Health and Family Welfare, was travelling in a car between Aurai and Mirzamurad regions

ప్రధాని నియోజకవర్గంలో కేంద్ర మంత్రికి పోకిరీల వేధింపులు..

Posted: 06/12/2018 06:37 PM IST
Anupriya patel s security breached three arrested in uttar pradesh

దేశంలోనే అత్యంత పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను స్వీకరించిన యోగీ అధిత్యనాత్ ఏ ముహూర్తంలో అధికారికంగా పగ్గాలు చేపట్టారో కానీ అయన పాలనపై మాత్రం ప్రజల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ రాష్ట్రంలో రమారమి రోజుకో అబలకు అన్యాయం జరుగుతున్న క్రమంలో బాధ్యతలను చేపట్టిన ఆయన.. రాష్ట్రంలో యాంటీ రోమియో స్వ్కాడ్ లను కూడా ఏర్పాటు చేశారు. అయితే అవి చాలా బాగా పనిచేస్తున్నాయని, వీటితో కాలేజీ వెళ్తున్న బాలికలు, యువతులను పోకిరీలు వేధించకుండా సత్పలితాలను ఇస్తున్నాయని అక్కడి అధికారిక వర్గాలు గొప్పలు చెప్పుకుంటున్నా.. వాస్తవానికి మాత్రం పరిస్థితి భిన్నంగా వుంది.

ఇందుకు సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రాతినిత్యం వహిస్తున్న వారణాసి లోక్ సభ నియోజకవర్గంలో జరిగిన ఘటనే నిదర్శనంగా మారింది. ఇతర పార్టీ నేతలకు ఈ పరాభవం ఎదురైతే ఔరా.. ఇది కూడా రాజకీయ కోణంలో అలోచించాల్సిందేనన్న ప్రశ్నలు ఉత్పన్నమయ్యేవేమో కానీ, స్వయంగా ప్రధాని మోదీ క్యాబినెట్ లో కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అనుప్రియ పటేల్ కు ఈ పరాభవం ఎధురైంది. దీంతో రాజకీయ విమర్శలు ఇక యోగీ సర్కార్ వైపుకు ఉప్పెనలా దూసుకెళ్తున్నాయి.

మహిళల రక్షణ పేరుతో ఆయన ఏర్పాటు చేసిన యాంటీ రోమియో బృందాల విషయం పక్కనబెడితే.. సోమవారం అర్ధరాత్రి కేంద్రమంత్రి అనుప్రియ పటేల్ ఈవ్ టీజింగ్ కు గురయ్యారు. ఆమె తన స్వంత నియోజకవర్గం మీర్జాపూర్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని తిరిగి వారణాసి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ దుర్ఘటనపై అనుప్రియ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఔరాయ్, మీర్జామురాద్ మధ్య కారులో ప్రయాణిస్తుండగా ముగ్గురు దుండగులు తనును వేధించినట్లు ఆరోపించారు.

నంబరు ప్లేట్ లేని కారులో వచ్చిన ఈ దుండగులు తన వాహన శ్రేణిని దాటేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. తన భద్రతా సిబ్బంది వారిని హెచ్చరించినప్పటికీ ఫలితం లేకపోయిందని పేర్కొన్నారు. తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని, తన భద్రతా సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించారని తెలిపారు. అనుప్రియ పటేల్ ఈ ఫిర్యాదును వారణాసి ఎస్ఎస్‌పీ ఆర్ కే భరద్వాజ్‌కు సమర్పించారు. భరద్వాజ్ తక్షణమే స్పందించి, నిందితుల కోసం గాలింపు ప్రారంభించారు. మీర్జామురాద్ పోలీసులు ఈ దుండగులను అరెస్టు చేసి, వారి కారును స్వాధీనం చేసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anupriya patel  Mirzapur  Eve teasing  Yogi Adityanath  Anti-Romeo squads  Varanasi  PM Modi  Uttar Pradesh  

Other Articles