Spritual leader Bhaiyyu Maharaj commits suicide మనోవేధనకులోనై అధ్యాత్మిక గురువు ఆత్మహత్య

Spiritual leader bhaiyyuji maharaj commits suicide in madhya pradesh

bhaiyyu maharaj, saint bhaiyyu maharaj, bhaiyyu maharaj shot, bombay hospital, bhaiyyu ji maharaj, spiritual guru bhaiyyu maharaj, bhaiyyu maharaj model, bhaiyyu maharaj ashram, bhaiyyu maharaj family, bhaiyyu maharaj name, saint, shot, bombay hospital, mental stress, suicide, indore, madhya pradesh, crime

In a shocking incident, popular spiritual leader Bhaiyyuji Maharaj allegedly shot himself in the forehead at his residence in Indore. He was admitted to Bombay hospital in the city where he succumbed to his injuries, police and hospital authorities said.

మనోవేధనకులోనై అధ్యాత్మిక గురువు ఆత్మహత్య

Posted: 06/12/2018 07:37 PM IST
Spiritual leader bhaiyyuji maharaj commits suicide in madhya pradesh

తన భక్తులకు శాంతి సందేశాన్ని పంచుతూ.. కీర్తిగడించిన ఆధ్యాత్మిక గురువే మనోవేదనకు లోనై తనను తాన కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన వద్దకు పరిష్కారం కోసం వచ్చే వేలాది భక్తులకు పంచిన శాంతి.. తన జీవితం నుంచి పోవడంతో.. ప్రశాంతత కరువైన ఆయన మానసిక వ్యధకు గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి  చెందిన  భయ్యూజీ మహరాజ్ తన ఆశ్రమంలో తుపాకీతో కాల్చుకుని చనిపోయారు. గమనించిన శిష్యులు ఆయనను హుటాహుటిన ఇండోర్ బాంబే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది.

భయ్యూజీ మహారాజ్ అప్పటికే మృతి చెందినట్లు బాంబే అస్పత్రి వైద్యులు నిర్ధారించారు. భయ్యూజీకి రీసెంట్ గా నర్మదా నది ప్రక్షాళన బోర్డులో భాగంగా.. శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కార్ కేబినెట్  హోదా కల్పించింది. దీనిని భయ్యూజీ తిరస్కరించారు. ప్రజలకు చేరువయ్యేందుకు పదవులు అవసరం లేదని ప్రకటించి.. ప్రజలకు మరింత దగ్గర అయ్యారు  భయ్యూజీ. నిత్యం ప్రజలకు ఆధ్యాత్మికత, ప్రశాంతత గురించి బోధించే వారు భయ్యూజీ. మనస్సు ప్రశాంతంగా ఉండాలని.. ప్రకృతిని ప్రేమించాలని.. అప్పుడే మనస్సు నిర్మలంగా, ప్రశాంతంగా ఉంటుందని భక్తులకు హితబోధ చేస్తుంటారు భయ్యూజీ.

అందులో భాగంగా నర్మదా నది ప్రక్షాళన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. నదులు మనిషి మనుగడలో భాగం అని.. వాటిని ప్రేమించాలని ప్రచారం చేశారు. ఎప్పుడూ అహింత, ప్రశాంతత గురించి ప్రసంగిస్తూ.. ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో చెబుతూ ఉంటారు భజ్యూజీ. అలాంటి ఆధ్యాత్మిక గురువే.. మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకోవటం ఆయన భక్తులనే కాకుండా.. మధ్యప్రదేశ్ ప్రజలను నివ్వెరపరిచింది. ఇటీవలే ప్రభుత్వం కేబినెట్ హోదాలో మంత్రి పదవి ఇచ్చినా వద్దన్నారు. కాగా, ఈ కేసు దర్యాప్తును రాష్ట్రప్రభుత్వం సీబిఐకి అప్పగించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bhaiyyu maharaj  saint  shot  bombay hospital  mental stress  suicide  indore  madhya pradesh  crime  

Other Articles