Kumaraswamy sensational allegations on BJP గోడ దూకే ఎమ్మెల్యేకు వంద కోట్లు.. మంత్రి పదవి..

Operation lotus kumaraswamy says bjp offered 100 crores to his mlas

Kumaraswamy, JDS, Karnataka election results, Revanna, minister posts, rs 100 crores, BJP, JDS sensational allegataions, prakash javadekar, karnataka, politics

The BJP has offered Rs. 100 crore in cash and cabinet positions to lawmakers of the Janata Dal Secular, its chief HD Kumaraswamy alleged today, ruling out any truck with the party in an attempt to take power in Karnataka.

గోడ దూకే ఎమ్మెల్యేకు వంద కోట్లు.. మంత్రి పదవి..

Posted: 05/16/2018 01:23 PM IST
Operation lotus kumaraswamy says bjp offered 100 crores to his mlas

తమ పార్టీ ఎమ్మెల్యేలను అక్రమ మార్గాల్లో బీజేపి.. తమ వైపు తిప్పుకునేందుకు అనైతిక చర్యలకు పాల్పడుతోందని జేడీఎస్‌ నేత కుమారస్వామి ఆరోపించారు. రూ.100 కోట్ల ఆఫర్ తోపాటు కొంతమంది జేడీఎస్‌ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కూడా ఇస్తామంటూ ప్రలోబాలకు పాల్పడుతున్నారని కుమారస్వామి మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సినంత మంది ఎమ్మెల్యేలు లేకపోయినా నరేంద్రమోదీ కర్ణాటకలో అధికారం చేపాడతాననడం ఆశ్చర్యంగా ఉందన్నారు. బీజేపి కర్ణాటకలో మత విద్వేషాలు రెచ్చగొట్టినందువల్లే 104 స్థానాలు గెలుపొందిందని కుమారస్వామి ఆరోపించారు.

బెంగళూరులో జరిగిన జేడీఎస్‌ శాసనసభాపక్ష సమావేశంలో కుమారస్వామిని ఎమ్మెల్యేలందరూ ఏకగ్రీవంగా శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. అనంతరం ఆయన తన సోదరుడు హెచ్డీ రేవణ్ణతో కలిసి మాట్లాడారు. కర్ణాటకలో జేడీఎస్ ను అంతమొందించాలన్నదే బీజేపి లక్ష్యమని ఆరోపించారు. రాష్ట్రంలో లౌకికవాదం నెలకొనాలనే కాంగ్రెస్ తో కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. 104 స్థానాలు గెలుచుకున్న బీజేపికి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేనందువల్లే తాము కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యామని పేర్కొన్నారు.

ఈ పొత్తు ఎన్నికల ఫలితాల తర్వాత కుదిరిందే తప్ప.. ఎన్నికల ముందు నిర్ణయించింది కాదని స్పష్టం చేశారు. తనకు అధికార దాహం లేదని.. ముఖ్యమంత్రి కావాలన్న కోరికా లేదని.. కేవలం రాష్ట్ర భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ తో పనిచేయాలని అనుకున్నామన్నారు. ఇక అధికారానికి అమడ దూరంలో నిలిచిన బీజేపి మాత్రం తాము అధికారపీఠం అధిరోహించి తీరుతామని ధీమా వ్యక్తం చేయడం అనైతిక చర్యలకు పాల్పడతామని స్వయంగా ప్రకటించుకోవడమేనని చెప్పారు. ఈ క్రమంలో జేడీఎస్‌లో చీలిక వస్తుందని కూడా బీజేపి ప్రచారం చేసిందని ఆయన దుయ్యబట్టారు.

అంతకుముందే మాట్లాడిన హెచ్ డీ రేవణ్ణ తన సోదరుడితో తనకు విభేధాలు వచ్చాయన్న వార్తలను ఖండించారు. జేడీఎస్ శాసన సభాపక్షనేతగా కుమారస్వామిని ఎన్నుకున్నామని, తమ పార్టీలో ఎలాంటి చీలిక లేదని స్పష్టం చేశారు. జేడీఎస్ నుంచి చీలతానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఈ వదంతులకు ఫుల్ స్టాప్ పెట్టాలని కోరారు. జేడీఎస్ - కాంగ్రెస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని చెప్పారు. జేడీఎస్ ఎల్పీ నేతగా ఎన్నికైన కుమారస్వామిని ఈ సందర్భంగా ఆయన అభినందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kumaraswamy  JDS  Revanna  mlas  minister posts  rs 100 crores  BJP  karnataka  politics  

Other Articles