governor delhi tour cancelled half way కాంగ్రెస్ సంచలన అరోపణలు.. రాహుల్ హత్యకు కుట్ర..

Congress says rahul gandhi s aircraft snag may be intentional tampering fir filed

Aircraft glitch, Rahul Gandhi, Congress, PM Modi, Randeep Surjewala, Kaushal Vidyarthee, karnataka, politics

A DGCA source said it appears to be a snag of autopilot which led to this incident, but the regulator will investigate in detail. The complaint said that the sudden shuddering of the aircraft and altitude dipping was not natural, but appeared to be a result of intentional tampering.

కాంగ్రెస్ సంచలన అరోపణలు.. రాహుల్ హత్యకు కుట్ర..

Posted: 04/27/2018 09:59 AM IST
Congress says rahul gandhi s aircraft snag may be intentional tampering fir filed

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఢిల్లీ నుంచి కర్ణాటకలోని హుబ్లీకి ఆయన ప్రయాణించిన విమానంలో సాంకేతిక లోపంతో తలెత్తడమే కాకుండా ల్యాండింగ్ కూడా సవ్యంగా కాలేదు. ఈ నేపథ్యంలో కర్ణాటక పోలీసులకు కాంగ్రెస్ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కర్ణాటక పోలీస్ చీఫ్ నీల్ మణి ఎ. రాజు మాట్లాడుతూ, ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని చెప్పారు.

కాగా, రాహుల్ కు ప్రధాని నరేంద్రమోదీ ఫోన్ చేసి ఆయన క్షేమ సమాచారాల గురించి ఆరా తీశారని కాంగ్రెస్ వర్గాల సమాచారం. ఈ ఫిర్యాదు విషయమై పౌరవిమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ కు పోలీసులు తెలియజేయనున్నట్టు తెలుస్తోంది. అయితే రాహుల్ ప్రచారంతో కర్నాటకలో మళ్లీ కాంగ్రెస్ పుంజుకుని విజయం దిశగా సాగడం జీర్ణంచుకోలేక కేంద్రం ఇలాంటి కుట్రలకు తెరలేపుతుందని కాంగ్రెస్ సంచలన అరోపణలు చేసింది.

ఇది అత్యంత ప్రమాదకరమైన అంశమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా వ్యాఖ్యలనించారు. రాహుల్ పై కుట్ర జరిగిందన్నది తమ ఆరోపణని, దీని వెనుక ఎవరున్నారో తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన ఘటన కాదని కొట్టిపారేయలేమని అన్నారు. కర్ణాటక ప్రజల ఆశీర్వాదంతోనే ఆయన క్షేమంగా నేలపై దిగారని అన్నారు. సాంకేతిక లోపం ఏర్పడి, ఆటోపైలట్ పనిచేయకపోవడం వెనుక కుట్ర ఏమైనా జరిగిందా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aircraft glitch  Rahul Gandhi  Congress  PM Modi  Randeep Surjewala  Kaushal Vidyarthee  karnataka  politics  

Other Articles