cadre and fans pay last tributes to anam viveka ఆనం తుదివీడ్కోలు.. భారీగా తరలివచ్చిన అభిమానులు

Cadre and fans pay last tributes to anam viveka

Anam Vivekananda Reddy, last tributes, anam viveka fans, anam viveka cadre, nellore locals, TDP ,KIMS hospital,passes away,anam vivekananda reddy passes away,anam vivekananda reddy death,anam vivekananda reddy dead,anam vivekananda reddy died,anam viveka no more, andhra pradesh, politics

nellore locals and his cadre including fans throng in large number to pay last tributes to senior leader anam vivekananda

ITEMVIDEOS: సింహపురి సింహానికి తుదివీడ్కోలు.. భారీగా తరలివచ్చిన అభిమానులు

Posted: 04/26/2018 11:06 AM IST
Cadre and fans pay last tributes to anam viveka

సింహపురి రాజకీయాలలో సింహంలా వెలుగొందిన తమ ప్రియతమ నేత ఆనం వివేకానంద రెడ్డి మరణంతో నెల్లూరు కన్నీటిసంద్రమైంది. వివేకా ఇక లేరు అనే వార్తను అక్కడి ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. వివేకాకు నివాళి అర్పించేందుకు ఈ తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో అభిమానులు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. ఆయన భౌతిక కాయానికి నివాళి అర్పించి, కన్నీటిపర్యంతం అవుతున్నారు. మారుమూల గ్రామాల నుంచి సైతం వివేకాను కడసారి చూసేందుకు అభిమానులు, కార్యకర్తలు, అనుయాయువులు నెల్లూరుకు చేరుకుంటున్నారు.

మరోవైపు, కాసేపట్లో నెల్లూరుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకోనున్నారు. ఈ సందర్భంగా వివేకాకు ఆయన నివాళి అర్పించి, కుటుంబసభ్యులకు సానుభూతిని తెలియజేయనున్నారు. ఈ సాయంత్రం వివేకా అంతిమ యాత్ర మొదలవుతుందని ఆయన సోదరుడు, మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి తెలిపారు. అధికారిక లాంఛనాలతో పెన్నా తీరంలో అంత్యక్రియలు జరుగుతాయని ఆయన చెప్పారు. వివేకా లేకపోతే రాజకీయమే లేదని అన్నారు.  నిత్యం ఎంతో సరదాగా, అనందంగా కనిపించే ఆనం వివేకాను ప్రొస్టేట్ క్యాన్సర్ మింగేసింది.
 
2012 నవంబర్ నుంచి ఆయన ఈ వ్యాధితో బాధపడుతున్నట్టు బయటపడింది. అప్పటి నుంచి ఆ క్యాన్సర్ మహమ్మారిపై ఆయన పోరాటం చేస్తూనే ఉన్నారు. దేశ, విదేశాల్లో చికిత్స చేయించుకున్నారు. ప్రముఖ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు కూడా ఆయనకు వైద్యం చేశారు. గత నవంబర్ లో కూడా వైద్యం కోసం సింగపూర్ వెళ్లి వచ్చారు. కానీ, ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదు. ఈ ఏడాది ఆరంభం నుంచి క్యాన్సర్ మరింత ముదిరింది. జనవరి నుంచి ఆయన హైదరాబాదులోని కిమ్స్ లో చికిత్స పొందారు. తన తల్లి మరణించిన సమయంలో ఒక్కసారి నెల్లూరుకు వెళ్లి వచ్చారు. వ్యాధి తీవ్రత ఎక్కువ కావడంతో, మార్చి 13 నుంచి 40 రోజుల పాటు ఆయన మృత్యువుతో పోరాడి.. క్రితం రోజున తుదిశ్వాస విడిచారు. 

(Video Source: AP24x7)

 
 
 

 

 
 
 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles