PM image in eyes of people is gone: Siddaramaiah ప్రధాని తన ప్రతిష్టను దిగజార్చకున్నారు:సీఎం

Pm called me sidda ruppaiya his image in eyes of people is gone siddaramaiah

narendra modi, siddaramaiah, karnataka election 2018, 2018 karnataka elections, karnataka chief minister siddaramaiah, siddaramaiah karnaaka assembly elections, PM Modi, siddaramaiah, corruption charges, assembly elections, karnataka, politics

Karnataka CM Siddaramaiah slammed PM Modi for levelling corruption allegations against him. Siddaramaiah accused PM Modi of making irresponsible statements and said that his image in the eyes of the people of Karnataka has been destroyed.

ప్రధాని తన ప్రతిష్టను నాశనం చేసుకున్నారు: సిద్దరామయ్య

Posted: 04/25/2018 08:58 PM IST
Pm called me sidda ruppaiya his image in eyes of people is gone siddaramaiah

కర్ణాటకలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి విజయం సాధిస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ తనపై అవినీతి అరోపణల విమర్శలు చేసి అప్రతిష్టను మూటగట్టుకున్నారని విమర్శించారు. తనపై చేసిన అరోపణల క్రమంలో ప్రధాని తన ప్రతిష్టను కూడా దిగజార్చుకున్నారని విరుచుకుపడ్డారు.

తమ ప్రభుత్వ సుపరిపాలన అందించిందని, అందుకే ప్రజలు మరోమారు తమ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి కంకణం కట్టుకున్నారని ధీమా వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో తమ ప్రభుత్వం మంచి పనితీరు కనబర్చిందని చెప్పారు. తమ పరిపాలన పట్ల రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని.. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. .  విజయం, సామాజిక న్యాయం తమ తొలి రెండు ప్రాధాన్యతలని వివరించారు. వాటినే తాము ఆచరిస్తున్నామన్నాని పేర్కొన్నారు.

బీజేపి జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా వద్ద ఎలాంటి వ్యూహం లేదని.. కొన్ని చోట్ల విజయం సాధిస్తే సాధించి ఉండొచ్చని కానీ కర్ణాటకలో ఎలాంటి వ్యూహాలు అమలుచేయలేరని వ్యాఖ్యానించారు. తమ పార్టీ కార్యకర్తలు చాలా మంది తాను ఉత్తర కర్ణాటక నుంచి పోటీచేయాలని ఆశించారని .. తద్వారా పొరుగు జిల్లాలకు సైతం తాను సాయపడగలుతానని చెప్పుకొచ్చారు. లింగాయత్ అంశం అటు కాంగ్రెస్‌, ఇటు భాజపాలకు నష్టం చేకూరుస్తుందన్న వార్తలపై ఆయన మాట్లాడుతూ ఇది కొత్త సమస్య కాదని.. రాజకీయ ఎత్తుగడ అసలే కాదన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM Modi  siddaramaiah  corruption charges  assembly elections  karnataka  politics  

Other Articles