Janasena gets into action for elections ఎన్నికలకు సిద్దమవుతున్న జనసేనదండు

Janasena appoints pannel speaker at vijayawada

powerstar Pawan Kalyan, JanaSena Pawan Kalyan, pannel speakers, addepally sridhar, andhra pradesh special status, TDP, YSRCP, BJP, chandrababu, vishnu kumar raju, JanaSena, corruption, JSP Fact finding commitee, andhra pradesh, politics

Actor turned politician powerstar Pawan Kalyan jana sena gets into action for forth comming assembly elections. The Heros Party appoints five members as pannel speakers at vijayawada in Andhra pradesh.

జనసేన ప్యానెల్ స్పీకర్ల నియామకం.. ఐదుగురితో..

Posted: 03/19/2018 09:39 AM IST
Janasena appoints pannel speaker at vijayawada

జనసేన అధినేత, పవన్ స్టార్ పవన్ కల్యాన్ అప్పుడే ఎన్నికల సమరాంగమనంలోకి కదం తొక్కారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలకు క్షేత్రస్థాయి నుంచి బలమైన కార్యవర్గం వున్న నేపథ్యంలో కొత్తగా వచ్చిన పార్టీ.. తొలిసారి ఎన్నికల కురుక్షేత్రంలోకి వెళ్తున్న క్రమంలో.. ఇన్నాళ్లు అచితూచి అడుగులు వేయాలని భావించింది. కానీ ఇక ఎన్నికలకు సమయం అసన్నమవుతున్న క్రమంలో.. తమ పార్టీ నిర్మాణం, బూత్ స్తాయిలో కార్యకర్తలు, సభ్యులు, మెంబర్లను ఏర్పాటు చేసుకునే దిశగా కూడా కదిలేందుకు సిద్దమైంది. కాగా, ముందుగా, తమ పార్టీ తరపున విజయవాడంలో ఐదుగురు ప్యానెల్ స్పీకర్లను ఏర్పాటు చేసింది.

మీడియాలో జరుగుతున్న రాజకీయ చర్చలకు, పార్టీ తరపున మాట్లేందుకు వీరికి అధికారాలను ఇస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. పార్టీ ఆదేశాలమేరకు విజయవాడలో వివిధ కార్యక్రమాలపై వీరు స్పందిస్తారు. నగరంలోని జనసేన సమన్వయ కార్యాలయంలో పార్టీనేత అద్దేపల్లి శ్రీధర్‌ ప్యాన ల్‌ స్పీకర్లను పరిచయం చేశారు. పోతిన వెంకటమహేష్‌, కాటూరి శ్రీనివాస్‌, మండలి రాజేష్‌, కామరాజు హరిష్‌ కమార్‌, బొప్పన శాంసన్‌లు ప్యానల్‌ స్పీకర్లుగా నియామకమయ్యారు.
 
 త్వరలో రైతులు, విద్యార్థులు, మహిళలు తదితర విభాగాలు, రాష్ట్ర స్థాయి, జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేయనున్నట్టు ఈ సందర్భంగా శ్రీధర్‌ చెప్పారు. పార్టీ సభ్యత్వం కొనసాగుతున్నదని, ఇంకా దీనిపై ప్రచారం జరుగుతోందని, యువత ఆకర్షితులవుతున్నారని చెప్పారు. మిస్డ్‌కాల్‌తో సభ్యత్వకార్డు కూడా వెంటనే వచ్చేయడం ప్రత్యేకత అన్నారు. పార్టీ కార్యకలాపాలను విస్తృతస్థాయిలో నిర్వహించడానికి తాము ప్రతివారం పర్యటిస్తామని, వివిధ సమాజ సేవా కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. జనసైనికులు ఎవరితోనూ గొడవపడరని, దీటుగా, అర్ధవంతంగా సమాధానం చెబుతారని తెలిపారు. పార్టీ ఇమేజ్‌ను పెంచేందుకు సంయుక్త కృషి జరుగుతుందని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles