YSRCP, TDP to push for no-confidence motion for APSP అవిశ్వాస తీర్మాణంపై ఆంధ్ర ఎంపీల పట్టు.. మద్దతు 102..?

Tdp ysr congress to push for no confidence motion today in lok sabha

TDP, YSRCP, no confidence motion, council of minister, prime minister, PM Modi, Union Govenment, Andhra pradesh, special status, congress, trinamul congress, left parties, national congress party, biju janatadal, andhra pradesh special status, BJP, chandrababu, vishnu kumar raju, JanaSena, corruption, andhra pradesh, politics

Both the government and Opposition have braced themselves for handling the no-confidence motion if the matter is taken up in Lok Sabha with ... YSRCP and TDP have given notices under Rule 198(B) of Lok Sabha for moving a no-confidence motion against the Union Council of Ministers.

అవిశ్వాస తీర్మాణంపై ఆంధ్ర ఎంపీల పట్టు.. మద్దతు 102..?

Posted: 03/19/2018 10:25 AM IST
Tdp ysr congress to push for no confidence motion today in lok sabha

రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వంతో అమీతూమి తేల్చుకునేందుకు రాష్ట్రంలోని ఎంపీలు తమ తమ పార్టీలవారీగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాలను ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర విభజనతో అతలాకుతలమైన అంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. గత నాలుగేళ్లుగా ఆ అంశాన్ని తాత్సరం చేసిందని అరోపిస్తూ.. నవ్యాంధ్ర ఎంపీలు అటు అవిశ్వాసానికి వ్యతిరేకంగా జాతీయ పార్టీల మద్దతును కూడా కూడగట్టుకునే పనిలో వున్నారు.

ఈ క్రమంలో ఇవాళ పార్లమెంటులోని ఉభయ సభల ముందుకు ఈ తీర్మానాలు చర్చకు వచ్చే అవకాశాలు వున్నాయి. ఇక ఎన్నికలకు ముందు వచ్చిన ఈ అవకాశాలను విపక్షానికి చెందిన పార్టీలు కూడా తమకు దక్కిన అరుదైన అవకాశంగా భావిస్తున్నాయి. దీంతో నవ్యాంధ్ర ఎంపీలకు పలు విపక్ష పార్టీలు మద్దుతు పలుకుతున్నాయి. ఇప్పటికే తాము అధికారంలోకి వస్తే అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదాను కల్పిస్తామని చెప్పిన 84వ పార్టీ ప్లీనరీలో తీర్మాణం ప్రవేశపెట్టిన కాంగ్రెస్.. అవిశ్వాస తీర్మాణానికి మద్దతు పలికింది.

ఏపీకి జరుగుతున్న అన్యాయం.. నవ్యాంధ్ర విషయంలో కేంద్ర ప్రభుత్వం అడుతున్న నాటకాన్ని ఎండగట్టేందుకు సిద్దం అయ్యింది. ఈ క్రమంలో అటు కాంగ్రెస్ పార్టీతో పాటు యూపీఏ అనుకూల పార్టీలన్నీ కూడా అవిశ్వాసానికి మద్దతు పలుకుతున్నాయి. ఇటు బీజు జనతాదళ్ పార్టీ, తృణముల్ కాంగ్రెస్, సహా వామపక్షాల పార్టీలు కూడా నవ్యాంధ్ర ఎంపీల అవిశ్వాస తీర్మాణానికి వ్యతిరేకంగా కదం కలుపుతున్నాయి. దీంతో హస్తిన రాజకీయాలు వేడెక్కాయి. అయితే ఎన్డీయేలో బీజేపీకి సొంతంగానే భారీ మెజార్టీ ఉన్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన ముప్పు ఏమీ లేదు. కాకపోతే, అవిశ్వాసంపై చర్చతో కేంద్రం చర్యలను పార్టీలు కడిగిపారేసే అవకాశముంది.

అవిశ్వాసానికి అనుకూలమైన పార్టీలు, ఎంపీల సంఖ్య:

    టీడీపీ - 16
    వైసీపీ - 5
    కాంగ్రెస్ - 48
    టీఎంసీ - 34
    వామపక్షాలు - 10
    బీజేడీ - 20
    ఇతరులు - 7
    మొత్తం - 140


అవిశ్వాసానికి వ్యతరేకమైన పార్టీలు, ఎంపీల సంఖ్య:

    బీజేపీ - 274
    ఎల్జేపీ - 6
    శిరోమణి అకాలీదళ్ - 4
    జేడీయూ - 2
    ఇతరులు - 47
    మొత్తం - 333

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles