students drown after boat capsizes in Maharashtra విహారయాత్రలో మహా విషాదం.. విద్యార్థుల గల్లంతు..

Three students drown 32 rescued after boat capsizes in maharashtra

maharashtra capsize, dahanu boat, Dahanu, boat students, Boat Capsize, crime

Three girls drowned and five were missing after a private boat with 40 students, who were on a school picnic, capsized this morning off the coast of Dahanu in Palghar district of Maharashtra.

ITEMVIDEOS: విహారయాత్రలో మహా విషాదం.. విద్యార్థుల గల్లంతు..

Posted: 01/13/2018 06:15 PM IST
Three students drown 32 rescued after boat capsizes in maharashtra

విహార యాత్రలో మరోమారు విషాదం సంభవించింది. వారాంతంలో విద్యార్థులు సరదాగా చేసిన విహారయాత్ర.. చివరికి విషాదంగా ముగిసింది.పాఠశాలలు, కాళాశాలలు విద్యార్థులను విహారయాత్రలకు పంపాలంటేనే భయంతో వణికిపోతున్న తల్లిదండ్రుల అందోళనలు మరోమారు అర్తనాథాలు పెట్టేలా చేశాయి. అరేబియా సముద్రంలో బోటు తలకిందులైన ఘటనలో నలుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో తీరపట్ణమైన దహనులో శనివారం ఈ సంఘటన చోటుచేసుకుంది.

విహారయాత్రలో భాగంగా ఓ పాఠశాలకు చెందిన 40 మంది విద్యార్థులు దహను బీచ్‌ నుంచి సముద్రంలోనికి వెళ్లారు. తీరం నుంచి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంగా.. బోటు ఒక్కసారిగా తలకిందులైంది. వెంటనే అప్రమత్తమైన రెస్క్యూ సిబ్బంది.. బోటువద్దకు చేరుకుని విద్యార్థులను కాపాడే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే నలుగురు ప్రాణాలు విడిచారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 36 మంది విద్యార్థులను కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చారు. సహాయక చర్యల్లో స్థానిక అధికారులతోపాటు నౌకాదళం కూడా పాలు పంచుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : maharashtra capsize  dahanu boat  Dahanu  boat students  Boat Capsize  crime  

Other Articles