new Rs 10 bank notes in chocolate brown కొత్త రూ. పది నోటు వచ్చేసిందోచ్..!

Rbi introduces new chocolate brown ten rupee note

demonetisation, note ban, currency notes, new note, Rs 50, Rs 10, Rs 200, Rs 100, Indian rupee, Reserve Bank of India, RBI, Rs 2000 note, Rs 500 note, Rs 200 note, Rs 50 note, Rs 50 new note, Rs 10 new note

RBI has announced it will shortly issue chocolate brown coloured Rs 10 denomination banknotes in the Mahatma Gandhi (New) Series, bearing signature of Dr. Urjit R. Patel, Governor

కొత్త రూ. పది నోటు వచ్చేసిందోచ్..!

Posted: 01/05/2018 06:47 PM IST
Rbi introduces new chocolate brown ten rupee note

నోట్ల రద్దు చేపట్టి ఏడాది కాలం ముగిసింది. మొదట్లో కేంద్రం తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని స్వాగతించిన వాళ్లు కూడా క్రమంగా విమర్శించడం మొదలు పెట్టేశారు. దేశంలోనే తొలి డిజిటల్ విలేజ్ గా పేరొందని గ్రామాలు కూడా క్రమంగా నోటుకే ఓటు వేశాయి. ఇక ఈ ఏడాది కాలంలో జరిగిన ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలలో బీజేపి విజయం సాధించినా.. క్రమంగా ప్రజల నుంచి మాత్రం కేంద్రంలోని సర్కారుపై వ్యతిరేకత క్రమంగా పెరుగుతుందని గుజరాత్ ఎన్నికల ఫలితాలు నిరూపిస్తున్నాయి.

ఈ విషయాలను పక్కనబెడితే కేంద్రం తీసుకునే నిర్ణయాలు కూడా ప్రజలను నోట్ల రద్దు అంశాన్ని మర్చిపోయేలా చేయడం లేదు. ఇటీవలే రూ.2000లోపు జరిపే డిజిటల్ లావాదేవీలపై వసూలు చేసే చార్జీలను మినహాయించనున్నట్లు ప్రకటించిన తరుణంలోనే ఇటు మరో కొత్త నోటును కూడా చెలమణిలోకి తీసుకువచ్చింది. ఇవాళే ఈ కొత్త రూ.10 నోట్లును ఆర్బీఐ విడుదల చేసింది. చాకొలెట్‌ రంగులో మహాత్మా గాంధీ బొమ్మతో పాటు ఒడిశాలోని ప్రముఖ కోణార్క్‌ ఆలయం డిజైన్‌ కూడా నోటుపై ముద్రించింది. కొత్త నోట్లు విడుదల చేసినా పాత రూ.10 నోట్లు చెల్లుబాటు అవుతాయని రిజర్వ్‌ బ్యాంక్‌ వెల్లడించింది.

కొత్త రూ.10 నోటు ఫీచర్లివే..
* పాత నోటులో ‘10’ సంఖ్య మధ్యలో ఉండేది. కానీ ఈ కొత్త నోటులో కుడివైపు కింద భాగంలో ముద్రించారు.
* గాంధీ బొమ్మను మధ్యలో ముద్రించారు.
* ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్ పటేల్ సంతకం కిందే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుర్తును ముద్రించారు.
* ఎడమ వైపు ఉండాల్సిన అశోక చక్రను కుడివైపునకు మార్చారు.
* కొత్త రూ.10 నోట్లు ప్రవేశపెట్టి పదేళ్లు అయిన సందర్భంగా ఎడమవైపు పది సంఖ్యను ముద్రించారు.
* నోటులో స్వచ్ఛ భారత్ లోగో కూడా కన్పిస్తోంది.
* ఈ నోటు పరిమాణం 63X123 మిల్లీమీటర్లు ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : demonetisation  note ban  currency notes  new note  Rs 50  Rs 10  Rs 200  Rs 100  

Other Articles