Prabhu Ramamoorthy Molests Woman on Board పరువు తీసిన భారతీయుడు.. విమానంలో లైంగికవేధింపులు

Indian origin molests woman on board spirit airlines flight arrested

Federal Bureau of Investigation, Prabhu Ramamoorthy, Spirit Airlines Flight, indian arrested america, indian arrested usa, molestation, american woman, crime

Indian-origin Prabhu Ramamoorthy admitted to Federal Bureau of Investigation officials that he "might have" unclasped the bra of the woman sleeping next to him, grabbed her breast and unzipped her trousers.

పరువు తీసిన భారతీయుడు.. విమానంలో లైంగికవేధింపులు

Posted: 01/06/2018 11:41 AM IST
Indian origin molests woman on board spirit airlines flight arrested

ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొడగరా నీ తల్లి భూమి భారతిని, నిలుపురా నీ జాతి నిండు గౌరవము అన్న రాయప్రోలు సుబ్బారావు భారత ఖ్యాతిని నలుదిశలా వ్యాపింపచేసిన ప్రవాసుల కోసం రాస్తూ.. ఇకపై విదేశాలకు వెళ్లే వాళ్లు కూడా ఇలా నడుచుకోవాలంటూ సూచిస్తూ ఈ గేయాన్ని రాశారు. అయితే విదేశాలలో స్థిరపడినా.. వక్రబుద్ది గలవాడు మాత్రం మారలేదు. విమానంలో ప్రయాణించినా.. తన తోటి ప్రయాణికురాలితో ఎలా నడుచుకోవాలో తెలియని వాడికి అక్కడి పోలీసులు అరదండాలు వేశారు.

లాస్ వెగాస్ నుంచి డెట్రాయిట్ కు విమానంలో ప్రయాణిస్తున్న భారతీయుడు తన పక్క సీటులో కూర్చున్న తోటి ప్రయాణికురాలైన యువతి పట్ల లైంగిక దాడికి పాల్పడి అత్యంత దారుణంగా.. తనలోని పైశాచిక మృగాన్ని నిద్రలేపాడంతో.. అమెరికా పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. వివారాల్లోకి వెళ్తే.. ప్రభు రామమూర్తి (34) తన భార్యతో కలిసి ప్రయాణిస్తున్నాడు. వారి పక్క సీటులో తన తోటి ప్రయాణికురాలైన అమెరీకన్ యువతి (22) నిద్రిస్తోంది.

కొంత దూరం సవ్యంగానే వున్న అతను.. ఆమె నిద్రలోకి జారుకున్న విషయాన్ని గమనించాడు. అంతే  రామమూర్తి తనలోని మరో పశువును నిద్రలేపాడు. ఆమెను అసభ్యంగా తాకుతూ, చేతులు వేస్తూ వేధింపులకు గురిచేశాడు. అమె షర్టు బటన్లను తీసేసి.. అమె లోదుస్తుల్ని కూడా తొలగించాడు. అపై అమెను తన చేతులతో తడిమాడు. ఈ మేరకు నిందితుడు రాంమూర్తి తనపై లైంగిక దాడి చేశాడని ఫ్లైట్ అటెడంట్ సహా విమానాశ్రయ అధికారులకు బాధితురాలు పిర్యాదు చేసింది. వారు గ్రౌండ్ సిబ్బందికి సమాచారం అందించారు.

విమానం డెట్రాయిట్‌లో ల్యాండ్ అవగానే అప్పటికే కాచుక్కూర్చున్న పోలీసులు రామమూర్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మిచిగాన్‌ కోర్టులో హాజరుపరిచారు. అయితే కోర్టులో రామమూర్తి మరోలా వాదన వినిపించాడు. తాను నిద్రమాత్ర వేసుకుని గాఢ నిద్రలోకి జారుకున్నానని, ఫిర్యాదు చేసిన యువతే తన మోకాళ్లపై పడుకుందని కోర్టుకు తెలియజేశాడు. అయితే అతడి వాదనను న్యాయమూర్తి విశ్వసించలేదు. నిందితుడికి బెయిలు ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో రామమూర్తిని జైలుకు తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles