Rajasthan BJP MLA controversial remarks ఉపఎన్నిక నేపథ్యంలో.. బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు..

Rajasthan bjp mla targets muslims over population growth

singhal, Facebook post, Banwari Lal Singhal, alwar parliamentary seat, Alwar MLA, political candidates, BL Singhal, alwar mla, controversy remarks, hindus, muslims, secondary citizens, lawmakers, alwar parliament seat byelection, children, politics, elections

A ruling BJP MLA in Rajasthan courted controversy by alleging that Muslims were bearing more children with an aim to outnumber Hindus and to take control of the country by 2030.

ఉపఎన్నిక నేపథ్యంలో.. బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు..

Posted: 01/02/2018 11:23 AM IST
Rajasthan bjp mla targets muslims over population growth

ఎన్నికలకు ముందు నేతలు అందివచ్చిన అన్ని అవకాశాలను వినియోగించుకుని గెలుపోందేందుకు ప్రయత్నం చేస్తారన్నది కాదనలేని వాస్తవం. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో గెలుపు కోసం సాక్షాత్తు దేశ ప్రధాన మంత్రి నరేంద్రమోడీ.. తన తలకు మాజీ ప్రధాని మన్మోహన్, మణిశంకర్ అయ్యార్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు వెలకట్టారని, పాకిస్థాన్ లోని వారికి సుపారీ కూడా ఇచ్చారని అత్యంత దిగజారుడు వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే అవి వివాదాస్పదమైన పాలకపక్షంపై కేసులు నమోదు చేసే ధైర్యం లేని కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం నిశ్చేష్టులుగా మారి తమాషా చూసిందన్న విమర్శలు కూడా ఈ క్రమంలో ఉత్పన్నమయ్యాయి.

ఈ వివాదాన్ని పక్కనబెడితే.. అత్యంత అనేక సందర్భాలలో ఇలాంటి విభజన వ్యాఖ్యలను తేరపైకి తీసుకువచ్చి లబ్ది పోందేందుకు నేతలు వెనకాడరు. ఇటీవల కర్ణాటక ఎన్నికలను టార్గెట్ చేసిన బీజేపి.. తమ ప్రతినిధిగా ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ అధిత్యనాథ్ ను పంపగా, హనుమంతుడు పుట్టిన నేతలో టిప్పు సుల్తాన్ జయంతోత్సవాలా..? అని ప్రశ్నించడం కూడా వివాదాస్పదమైంది. హనుమంతుడు దేవుడు.. టిప్పుసుల్తాన్ పాలకుడు.. స్వతంత్ర సంగ్రామోద్యమంలో కూడా ఆయన పాత్ర అనిర్వచనీమయైనదే. కానీ ఈ రెండింటికీ లింకుపెట్టి.. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆయనకే చెల్లింది.

ఇక తాజాగా రాజస్థాన్ లోని అల్వార్ పార్లమెంటరీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్న క్రమంలో అక్కడి ఓ బిజేపి ఎమ్మెల్యే కూడా ఇదేస్థాయిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో ముస్లింలు హిందువుల కంటే ఎక్కువ సంఖ్యకు చేరుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారని బన్వారీలాల్ సింఘాల్ పేర్కోన్నారు. 2030 నాటికి తమ జనాభాను పెంపొందించుకుని దేశంపై నియంత్రణ సాధించడమే వారి ద్యేయమని బన్వారీలాల్ సింఘాల్ ఆరోపించారు. భారతదేశంలో ముస్లిం జనాభా పెరుగుదలకు సంబంధించిన వీడియోను చూసిన తర్వాత ఆయన ఫేస్ బుక్ లో ఈ పోస్టు పెడుతున్నట్లు పేర్కొన్నారు.

ఈ నెల 29 న ఆల్వార్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఎమ్మెల్యే బన్వారీ లాల్ సింఘాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘ముస్లింలు 12-14 మంది పిల్లలకు జన్మనిస్తున్నారని.... హిందువులు ఈ సంఖ్యను ఒకరు లేదా ఇద్దరికే పరిమితం చేశారు’’ అని ఎమ్మెల్యే ఫేస్ బుక్ పోస్టులో వ్యాఖ్యానించారు. పెరుగుతున్న ముస్లింల జనాభా వల్ల హిందువుల ఉనికి ప్రమాదంలో ఉందన్నారు. దేశంలో రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రుల కుర్చీలో ఒక ముస్లింను కూర్చొబెట్టేందుకు ప్రణాళిక రూపొందించారని ముస్లింలు చట్టసభ సభ్యులుగా మారితే హిందువులు ద్వితీయ పౌరులు అవుతారని ఎమ్మెల్యే ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh