ghazal srinivas arrested in molestation case గాయకుడు గజల్ శ్రీనివాస్ అరెస్ట్

Popular singer ghazal srinivas arrested in molestation case

ghazal srinivas, kesiraju srinivas, alayavani, radio jakie, kumari, web radio, crime, violence on women, trending

Guinness World Record Awardee Kesiraju Srinivas, popularly known as Ghazal Srinivas is arrested on molestation charges.

ప్రముఖ గాయకుడి పాడు పని.. అరెస్ట్

Posted: 01/02/2018 12:12 PM IST
Popular singer ghazal srinivas arrested in molestation case

ప్రముఖ గాయకుడు కేసిరాజు అలియాస్ గజల్ శ్రీనివాస్ ను అరెస్టు అయ్యారు. తెలుగురాష్ట్రాలలో సంచలనం రేపుతున్న ఆయన అరెస్టు వార్త.. ఆయన అభిమానులను కూడా విస్మయానికి గురిచేసింది. అదీనూ లైంగిక అరోపణల కేసులో శ్రీనివాస్ అరెస్టు కావడం కలకలం రేపుతుంది. గిన్నీస్ బుక్ రికార్డుతో పాటు అనేక అవార్డులను అందుకున్న శ్రీనివాస్ తన గానంతో తెలుగుతో పాటు అనేక బాషల్లో అభిమానులు సంపాధించుకుని.. ఇలాంటి చర్యలకు పాల్పడ్డారా..? అన్న సందేహాలు కూడా అభిమానుల్లో రేకెత్తుతున్నాయి.

కాగా, లైంగిక వేదింపుల కేసులో శ్రీనివాస్ ను పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై లైంగిక వేధింపుల పిర్యాదు అందడంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆయను అరెస్టు చేశారు. యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు గాను ఈ కేసు నమోదైందని సమాచారం. గత కొంతకాలంగా ఓ యువతి పట్ల శ్రీనివాస్ లైంగికంగా వేధింపులకు పాల్పడుతూ.. తన మాట వినకపోతే పరిణామాలు త్రీవంగా వుంటాయంటూ మానసికంగా కూడా అమెను వేధిస్తున్నాడని తెలుస్తుంది.

అయితే అందిన సమాచారం ప్రకారం గజల్ శ్రీనివాస్ నుంచి వేధింపులకు గురైన ఆ యువతి.. ఆయనకు చెందిన అలయవాణి అనే వెబ్ రేడియోలో రేడియో జాకీగా పనిచేస్తుందని సమాచారం. బాధితురాలి గత కొంతకాలంగా జాకీగా విధులు నిర్వహిస్తుందని, ఈ క్రమంలో కార్యాలయానికి వస్తున్న గజల్ శ్రీనివాస్.. అమెను తన చాంబర్ లోనికి పిలిచి అమెపై లైంగిక వేధింపులకు, బెదిరింపులకు కూడా పాల్పడుతున్నాడని.. దీంతో తనకు మరోమార్గం లేక బాధితురాలు పోలీసులను అశ్రయించి.. శ్రీనివాస్ పై పిర్యాదు చేసింది. కాగా, శ్రీనివాస్ తో పాటు ఆలయవాణి సీఈవోపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ghazal srinivas  kesiraju srinivas  alayavani  radio jakie  kumari  web radio  crime  violence on women  trending  

Other Articles