do you know Satavahanas are seven vehicles శాతవాహనులు అంటే సప్తవాహనాలు..

For bihar univ history examinees satavahanas are seven vehicles

Bihar university, Bhupendra Narayan Mandal University, BNMU, Madhepura, Satavahana, Indus Valley Civilization, education, Purnia Women’s College, Bihar education, latest news

Asked to discuss achievements of Satavahanas, many examinees of Bhupendra Narayan Mandal University, Madhepura, described features of seven vehicles that included bicyles, motorcycles, four-wheelers and even aircraft.

వీరికి జ్ఞానం అపూర్వం: శాతవాహనులు అంటే సప్తవాహనాలు..

Posted: 12/29/2017 02:03 PM IST
For bihar univ history examinees satavahanas are seven vehicles

ఏ విద్యార్థి అయినా తమ విద్యలో అపార జ్ఞానాన్ని సంపాదించినా.. లేక అద్బుత ప్రతిభను కనబర్చినా వారి ఉపాధ్యాయులు, తద్వారా జిల్లా, రాష్ట్ర అధికారులు కూడా వారిని ప్రశంసల్లో ముంచెత్తుతారు. అయితే ఇక్కడ ఈ విద్యార్థులకు చదువులు చెప్పిన ఉపాధ్యాయులను మాత్రం ఏకంగా సన్మానించాలి. అలాంటి ఉపాధయాయులను ఏరికోరి నియామకం చేసుకున్న బీహార్ రాష్ట్ర విద్యాశాఖ అధికారులకు కూడా దండం పెట్టాలి. ఎందుకంటారా..? ఈ కింద ప్రశ్నలకు సమాధానాలు చూస్తే మీరు అంగికరించక తప్పదు.

ప్రశ్న : శాతవాహనులు అంటే ఎవరు..

సమాధానం : శాతవాహనులు అంటే ఏడు వాహనాలు కలిగి ఉన్న వారు. సైకిళ్లు, బైక్స్, ఫోర్ వీలర్స్, ఎయిర్ క్రాఫ్ట్స్, విమానాలు కలిగి ఉన్న వారిని శాతవాహనులు అంటారు. ఇది కూడా వివిధ రంగుల్లో ఉంటాయి. ఈ వాహనాలు ఉన్నవారినే శాతవాహనులుగా పిలుస్తారు.

ప్రశ్న : ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, అరబ్ ఇన్వెన్షన్ ఆఫ్ సింధ్ అంటే ఎంటీ?

సమాధానం : ఇండస్ వ్యాలీ అనేది ఓ ప్రాంతం. దానిపై అరబ్బులు దాడి చేశారు. దాన్ని నాశనం చేశారు. ఇండస్ వ్యాలీని స్వాధీనం చేసుకున్నారు. ఈ యుద్ధం ఇటీవలే జరిగింది. ఈ యుద్ధంలో దుబాయ్ లోని దేశాలు అన్ని కలిసి దాడి చేశాయి.

ఈ ప్రశ్నలు ఇచ్చింది బీహార్ లోని భూపేంద్ర నారాయణ్ మండల్ యూనివర్శిటీ. హిస్టరీ స్టూడెంట్స్ కు (సోషల్ సబ్జెక్ట్) ఇచ్చిన ప్రశ్నాపత్రం. BA మొదటి సెమిస్టర్ కింద ఈ ప్రశ్నలు ఇచ్చింది ఇచ్చారు. పరీక్షలు రాసింది కూడా డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఆ యూనివర్సిటీ విద్యార్ధులే. సమాధానాలు మాత్రం ఈ విధంగా రాశారు. శాతవాహనులు అంటే ఎవరో కూడా తెలియకుండా హిస్టరీ ఎలా చదువుతున్నారో అర్థం కావటం లేదని పరీక్ష పేపర్లు దిద్దిన పుర్ణయా కాలేజీ లెక్చరర్ అంటున్నారు. ఇలాంటి వింత సమాధానాలు రాసింది మొత్తం భూపేంద్ర నారాయణ్ మండల్ యూనివర్సిటీలో హిస్టరీ చదువుతున్న స్టూడెంట్సే అని చెబుతున్నారు లెక్చరర్లు.

బీహార్ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ స్టాండెడ్స్ ఎలా ఉన్నాయో చెప్పటానికి ఈ ఎగ్జాంపుల్ చాలు అంటున్నారు. బీఏ స్టూడెంట్స్ అంటే మరో నాలుగేళ్లలో ఉద్యోగ అన్వేషణకు వెళతారు.. అలాంటి స్టూడెంట్స్ కి చదువుపై ఎంత ధ్యాస ఉందో.. చెప్పేవారికి ఎంత బాధ్యత ఉందో అర్థం అవుతుందని పరీక్ష పేపర్లు దిద్దిన పుర్ణయా కాలేజీ ప్రొఫెసర్లు అంటున్నారు. హిస్టరీ స్టూడెంట్స్ కు బేసిక్ నాలెడ్జ్ అయిన శానవాహనుల కాలం సబ్జెక్ట్ పైనే అవగాహన లేకపోవటం విడ్డూరం అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : history students  satavahana  saat vahans  indus valley civilization  bihar  

Other Articles