Govt takes back cooking gas price hike order ఎల్పీజీ సబ్సీడి సిలిండర్ల ధరల పెంపుపై ఊరట..

Government likely to scrap monthly lpg price hike

LPG price, gas prices, monthly increase in gas prices, LPg cylinder, subsidised LPG cylinder, non-subsidised LPG cylinder, latest news

Taking a U-turn on LPG prices, the government has withdrawn its decision to raise cooking gas LPG prices by Rs 4 per cylinder every month.

ఎల్పీజీ సబ్సీడి సిలిండర్ల ధరల పెంపుపై ఊరట..

Posted: 12/28/2017 06:08 PM IST
Government likely to scrap monthly lpg price hike

ఎల్పీజీ సబ్సిడీ గ్యాస్ సలిండర్ ధరల పెంపుపై ప్రభుత్వం ఊరట ఇచ్చింది. ఎల్సీజీ గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీలను ఎత్తివేసే క్రమంలో ఈ ఏడాది జూన్ నుంచి ప్రతి నెల ఒక్కో ఎల్పీజీ సిలిండరుపై రూ.4 ధర పెంచాలని తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అదేశాలు రావడంతో.. అయిల్ మార్కెటింగ్ కంపెనీలు.. ఈ ఏడాది జూన్‌ నుంచి ప్రతి నెలా ఒక్కో ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.4 ధర పెంచుతూ వచ్చాయి. అయితే దీనిపై కూడా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది.

ఇటీవల గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో చావు తప్పి కన్ను లోట్టపోయిన చందంగా అధికారంలోకి వచ్చిన బీజేపి.. తమ ప్రభుత్వం చేపట్టాల్సిన సంస్కరణలకు, ధరఘాతాలకు ఇక స్వస్తి పలకనుంది. మరోవైపు సార్వత్రిక ఎన్నికలకు కేవలం ఏడాదిన్నర సమయం మాత్రమే వున్న నేపథ్యంలో ఇక ఇబ్బడిముబడ్డిగా రాయితీలు, వరాలు కురిపించే యత్నం చేయనుంది. మరోవైపు నిరుద్యోగులను అకర్షించేందుకు ఇప్పటికే నాలుగు లక్షల ఉద్యోగాలను త్వరలో భర్తీ చేస్తామని కూడా ప్రకటించింది.

ఈ తరుణంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఇండియా, హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లు అక్టోబర్‌ నుంచి ఎల్పీజీ ధరలను పెంచడం లేదని పేర్కొన్నాయి. ఆయిల్ కంపెనీలు ఎల్పీజీ రేట్లను 10 సార్లు పెంచాయి. ఏడాదిలో ప్రతి గృహ వినియోగానికి సబ్సిడీ ధరలో 12 సిలిండర్లను అందిస్తున్నారు. 2017 జూన్‌ నుంచి ఒక్కో సిలిండర్‌పై రూ.4 పెంచుతూ.. 2018 మార్చి నాటికి లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే లోపల వీటిపై ప్రభుత్వం అందించే సబ్సిడీని జీరో చేయాలని భావించింది. ఒకవైపు ఉచితంగా వంట గ్యాస్ కనెక్షన్లను ఇస్తూ... మరోవైపు ధరలు పెంచడం సబబు కాదని వాదనలు వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles