Sushma Swaraj on Jadhav’s family harassed పాకిస్థాన్ నీచకార్యాలను దుయ్యబట్టిన సుష్మాస్వరాజ్

Pakistan made jadhav s wife mother appear as widows to him says sushma swaraj in parliament

Sushma Swaraj, mallikarjun kharge, S Jaishankar, Pakistan, Sushma Swaraj, Kulbhushan Jadhav, ministry of external affairs (MEA), International Court of Justice (ICJ), Pakistani media, JP Singh, Terrorist, Indian High Commission, Kulbushan Jadhav family, Kulbushan Jadhav mother, Kulbushan Jadhav wife, ICJ

"Pakistan made Kulbhushan Jadhav's wife and mother appear as widows to him, by forcing them to take off their mangalsutra, bindi and bangles," said Union minister Sushma Swaraj

పాకిస్థాన్ నీచకార్యాలను ఎండగట్టిన సుష్మాస్వరాజ్

Posted: 12/28/2017 12:24 PM IST
Pakistan made jadhav s wife mother appear as widows to him says sushma swaraj in parliament

భారత నేవీ మాజీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ పై భారత గూఢచారి అని ముద్ర వేసి జైలులో బంధీగా వుంచిన తరుణంలో అయనను చూసేందుకు వెళ్లిన అతని భార్య, తల్లిని వితంతువులుగా పాకిస్తాన్ మార్చివేసిందని.. భారత విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ దాయాధి దేశంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కొడుకును చూసేందుకు తల్లి, భర్తను చూసేందుకు భార్య వెళ్లగా, వారిని వితంతువులుగా మార్చి విష ప్రచారం చేయడాన్ని కూడా అమె అక్షేఫించారు. పైగా భార్యను బురఖా లాంటి నల్లవస్త్రాలే ధరించాలని అంక్షలు పెట్టడంపై కూడా అమె తీవ్రస్థాయిలో అగ్రహం వ్యక్తం చేశారు.  

పార్లమెంటులోని పెద్దల సభ (రాజ్యసభ)లో అమె కుల్ భూషణ్ జాదవ్ విషయమై ప్రకటన చేస్తూ.. జాదవ్ ను కలిసేందుకు ముందు ఆయన భార్య, తల్లి చేత గాజులు తీయించడం, తాళిబొట్టు, బొట్టులను తీయించడం వారు అచరించే సంప్రాదాయాలపై ప్రభావం చూపేలా చేయడం అమానవీయమన్నారు. జాధవ్ తల్లి అవంతితో తాను మాట్లాడినట్లు వెల్లడించారు. తన మెడలో తాళిబోట్టు లేకపోవడంతో అందోళన చెందిన జాదవ్ తొలిమాటగా నాన్న ఎలా ఉన్నారని? అడిగినట్లు చెప్పారు. జాధవ్ భార్యతో  కూడా తాను మాట్లాడానని సుష్మా చెప్పారు.

తన బూట్లు తిరిగి ఇవ్వాలని ఎన్నిసార్లు కోరినా పాకిస్తాన్ అధికారులు ఇవ్వలేదని వెల్లడించారు. ఆ బూట్లలో కెమెరా ఉందంటూ పాక్ ప్రకటన చేయడం మరింత నీచానికి దిగజారడమేనని సుష్మా దుయ్యబట్టారు. బూట్లలో ఏదైనా అమె విమానం ఎలా ఎక్కేదని ప్రశ్నించారు. మావవతా దృష్టితో జాధవ్ ను కలవడానికి అంగీకరించామని చెబుతూ పాక్ ఇలాంటి నీచకార్యాలకు పాల్పడటం అమానుషమని ధ్వజమెత్తారు. జాధవ్ కుటుంబసభ్యుల మానవ హక్కులు పాకిస్తాన్ లో పదే పదే ఉల్లంఘనకు గురయ్యాయని చెప్పారు. ఓ భీతావాహ వాతావరణంలో జాధవ్ ను కుటుంబ సభ్యులు కలిశారని ఆవేదన వ్యక్తం చేశారు.

చీర మాత్రమే కట్టుకునే జాధవ్‌ తల్లితో సాల్వార్‌ కుర్తా వేయించారని.. మారఠీ మాత్రమే వచ్చిన తల్లి జాదవ్ తో అ బాషలో మాట్లాడనివ్వలేదని తెలిపారు. అమె మరాఠీలో మాట్లాడటంతో ఇంటర్ కామ్ ను పాకిస్తాన్‌ అధికారులు ఆపివేసినట్లు సుష్మా తెలిపారు. జాధవ్ ను సురక్షితంగా విడిపించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని సుష్మా స్వరాజ్ వెల్లడించారు. అనంతరం కాంగ్రెస్ పక్ష నాయకుడు మల్లిఖార్జున్ ఖార్గే మాట్లాడుతూ జాధవ్‌ తల్లి, భార్యలతో అమర్యాదగా ప్రవర్తించడాన్ని ప్రతి భారతీయుడితో అమర్యాదగా ప్రవర్తించడంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. రాజకీయ భేధాలతో సంబంధం లేకుండా దేశ ప్రజల పట్ల అగౌరవంగా నడుచుకుంటే సహించబోమని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles