Thank you, 'Mr Jaitlie': Rahul Gandhi's stinging comeback కేంద్రమంత్రికి దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చిన రాహుల్..!

Thank you mr jaitlie rahul gandhi s stinging comeback

Rahul Gandhi, Narendra Modi, Manmohan Singh, Congress, BJP, Hamid Ansari, PM Modi, Rahul gandhi on bjplies, rahul gandhi counter, Arun Jaitley, Congress, BJP, Karnataka, Nation, Current Affairs, India

Congress president Rahul Gandhi delivered a stinging comeback to Arun Jaitley after the that Prime Minister Narendra Modi had never questioned his predecessor Manmohan Singh's integrity and commitment to the nation.

ITEMVIDEOS: కేంద్రమంత్రికి దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చిన రాహుల్..!

Posted: 12/28/2017 11:33 AM IST
Thank you mr jaitlie rahul gandhi s stinging comeback

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో విజయాన్ని నమోదు చేసుకునేందుకు ప్రధాని నరేంద్రమోడీ.. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పై చేసిన అనుచిత వ్యాఖ్యల అంశంపై మరోమారు కాంగ్రెస్ అధ్యక్షుడు  రాహుల్ గాంధీ ప్రస్తావించారు. ప్రధాని బేషరుతుగా మన్మోహన్ సింగ్ కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మోడీ హత్యకు పాకిస్థాన్ తో సుపారీ కుదుర్చుకున్నారని గుజరాత్ ఎన్నికల సందర్భంగా ప్రధాని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

అయితే ఈ వ్యాఖ్యలపై కేంద్రఅర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనను ఆయన తప్పుబట్టారు. జైట్లీ.. జైట్-లై(అబద్ధాలకోరు) అని అభివర్ణిస్తూ ట్విట్టర్లో రాహుల్‌ కౌంటర్ ఇచ్చారు. ‘‘జైట్లీ గారూ మీకు ధన్యవాదాలు. మన ప్రధానిగారు చెప్పిన పనులు అస్సలు చేయరని మీరు ఒప్పుకున్నందుకు సంతోషం, బీజేపీ అబద్ధాలకోరుల పార్టీ’’ అని ట్వీట్‌ చేశారు. అంతేకాదు ప్రచార సమయంలో మోదీ ప్రసంగాన్ని.. జైట్లీ రాజ్యసభలో మాట్లాడిన మాటల వీడియోలను పక్కపక్కనే ఉంచి మరో సందేశాన్ని ఉంచారు.

ప్రధాని లాంటి స్థాయి ఉన్న వ్యక్తిని కించపరిస్తే తమ పార్టీ ఉపేక్షించలేదన్న విషయాన్ని(మణిశంకర్‌ అయ్యర్‌ వేటు) గుర్తు చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ.. మన్మోహన్‌, హమీద్‌ అన్సారీ(మాజీ ఉపరాష్ట్రపతి) లపై వ్యాఖ్యలు చేసిన ప్రధాని నుంచి కనీసం క్షమాపణ కూడా చెప్పించకపోవటం దారుణమని బీజేపీపై మండిపడుతోంది. ఎన్నికలలో గెలుపు కోసం ప్రధాని స్థాయి వ్యక్తి అత్యంత దిగజారుడు స్థాయిని కనబర్చడం ద్వారా గుజరాత్ ఎన్నికలను ఎంతో అసక్తిగా చూసిన ప్రపంచ దేశాల ఎదుట దేశం పరువు మంటగలిసిందని కూడా కాంగ్రెస్ అరోపిస్తుంది.

కాగా, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దేశభక్తిని, అంకిత భావాన్ని తాము ప్రశ్నించలేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రసంగాల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను, మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీలను ఎక్కడా ప్రశ్నించలేదు. అదేవిధంగా వారికి దేశంపట్ల ఉన్న నిబద్ధతపై అనుమానాలు లేవు. మన్మోహన్‌, అన్సారీలకున్న దేశభక్తి పట్ల మాకు నమ్మకం, విశ్వాసం ఉన్నాయని’ అరుణ్‌ జైట్లీ పేర్కొన్నారు.

అయితే ప్రధాని బహిరంగంగా గుజరాత్ ఎన్నికల ప్రచారంలో గుజరాతీలో అరోపణలు చేస్తే.. కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ మాత్రం లోక్ సభలో అంగ్లంలో మన్మోహన్ సింగ్, హమీద్ అన్సారీలపై తమకు నమ్మకం, విశ్వాసం వున్నాయని చెప్పడం ఎంతవరకు సమంజసమని కూడా కాంగ్రెస్ ప్రశ్నిస్తుంది. ఎన్నికలు ముగిసిన తరువాత కూడా ప్రధాని నరేంద్రమోడీ తన తప్పుడు అరోపణలకు తలొగ్గి మన్మోహన్ సింగ్, హమీద్ అన్సారీలకు బేషరుతుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM Modi  Arun jaitley  parliament  Bjp  #RahulGandhi  #Congress  #OfficeOfRG #BJPLies  Nation  Current Affairs  India  

Other Articles