Over 4 lakh vacant posts filled in central govt departments నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 4 లక్షల ఉద్యోగాల భర్తీ..

Over 4 lakh posts vacant in central government departments

minister, Lok Sabha, Jitendra Singh, Government, Employees, pay and allowances, central government civilian employees, annual report, latest news

Over four lakh posts are vacant in various central government departments, the Lok Sabha was informed today.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 4 లక్షల ఉద్యోగాల భర్తీ..

Posted: 12/20/2017 05:56 PM IST
Over 4 lakh posts vacant in central government departments

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో తమ కోటకు బీటాలు వారాయన్న సత్యాన్ని కేంద్రంలోని అధికార బీజేపి ప్రభుత్వం గ్రహించినట్లుంది. గుజరాత్ ఎన్నికలలో విపక్ష పార్టీ నేతలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంతో తర్జనభర్జన పడిన బీజేపి నేతలు రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఆ ప్రశ్నలు ఉత్పన్నం కాకుండా చేయాలని భావిస్తున్నట్లుంది. దీంతో పాటు వచ్చే సార్వత్రిక ఎన్నికలో తమ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు పథక రచన కూడా చేస్తుంది.

అందులో భాగంగానే నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. కేంద్ర ప్రభుత్వ రగం సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల వేతనాలు, అలవెన్సులకు సంబంధించిన వార్షిక నివేదికను లోక్ సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన ఈ ఉద్యోగ ఖాళీల సంఖ్యను ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 4 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ వెల్లడించారు. లోక్ సభకు సమర్పించిన నివేదికలో ఖాళీగా ఉన్న పోస్టుల ఈ విషయాన్ని కేంద్ర మంత్రి చెప్పారు.

మార్చి 1,2016 నినేదిక ప్రకారం మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 4,12,752 పోస్టులు ఖాళీగా ఉన్నాయని మంత్రి జితేంద్రసింగ్ స్పష్టంచేశారు. ఖాళీగా వున్న ఉద్యోగాలన్నింటినీ త్వరలో భర్తీ చేస్తామని మంత్రి తెలిపారు. శాఖల పరంగా అన్ని ఉద్యోగాలను క్రమంగా భర్తీ చేయనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలనే ప్రతిపాదన ఏదీ రాలేదని తమ ముందుకు రాలేదని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : minister  Lok Sabha  Jitendra Singh  Government  Employees  pay and allowances  annual report  latest news  

Other Articles