BJP set to win Gujarat state election Gujarat and Himachal | రెండింటిలో కమలానిదే హవా.. కానీ, నైతిక గెలుపు మాత్రం కాంగ్రెస్ దే!

Gujarat himachal counting updates

Gujarat, Himachal Pradesh, Assembly Elections Result, Election Results, Gujarat Results, Himachal Pradesh Results,

Gujarat and Himachal Pradesh assembly polls Result. Narendra Modi rescues BJP, yet again in Gujarat. Allegations Congress lost Himachal Pradesh.

గుజరాత్, హిమాచల్ లో కమల వికాసం

Posted: 12/18/2017 03:53 PM IST
Gujarat himachal counting updates

గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఓట్ల‌ లెక్కింపు ముగిసింది. ఫ‌లితాల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ విజ‌య దుందుభి మోగించింది.  ప్ర‌భుత్వ ఏర్పాటుకు కావాల్సిన 92 స్థానాల్ని భార‌తీయ జ‌నతా పార్టీ ఇప్ప‌టికే సాధించిన విష‌యం తెలిసిందే. గుజరాత్‌లో బీజేపీ మొత్తం 99 స్థానాలు గెలుపొందింది. కాంగ్రెస్ కూట‌మి 80 స్థానాల‌ను గెలుపొందింది. ఇక ఇత‌రులు 3 స్థానాల్లో విజ‌యం పొందారు.

కాగా, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోనూ బీజేపీ మ్యాజిక్ ఫిగర్ (35) ను దాటేసి దూసుకెళుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 41 స్థానాల్లో గెలుపొందిన బీజేపీ మ‌రో 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 19 స్థానాల్లో గెలుపొంది 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక ఇత‌రులు 3 స్థానాల్లో గెలుపొందారు. దేశ వ్యాప్తంగా బీజేపీ నేత‌ల సంబ‌రాలు అంబ‌రాన్నంటుతున్నాయి.

హర్దిక్ అవే ఆరోపణలు...

చాలాచోట్ల బీజేపీ ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేశారు.. రిజర్వేషన్ల కోసం మా పోరాటం కొనసాగుతుంది. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా బీజేపీపై పోరాడుతాం అని పటీదార్ ఉద్యమ నేత హర్దిక్ పటేల్ తెలిపారు.

ఖండించిన కేంద్ర మంత్రి...

గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో ఇప్ప‌టికే అత్యధిక స్థానాల్లో గెలిచి ప్ర‌భుత్వ ఏర్పాటుకు కావాల్సిన బ‌లాన్ని సంపాదించిన భార‌తీయ జ‌న‌తా పార్టీ హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోనూ దూసుకెళుతోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కొంద‌రు ఈవీఎంల ట్యాంప‌రింగ్ జ‌రిగిందంటూ త‌మ ఓట‌మిని క‌ప్పిపుచ్చుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నేత నితిన్ గ‌డ్క‌రీ మాట్లాడుతూ... ఎన్నిక‌ల్లో ఓడిపోతే ఈవీఎంలు స‌రిగా లేవ‌న‌డం స‌రికాద‌ని అన్నారు. అటువంటి వ్యాఖ్య‌లు చేయ‌డం ఏంట‌ని నితిన్ గ‌డ్క‌రీ ప్ర‌శ్నించారు. గుజ‌రాత్, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు బీజేపీకి మ‌ద్ద‌తు ప‌లికార‌ని చెప్పారు. అభివృద్ధికే ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టార‌ని చెప్పారు. ఎన్నిక‌ల్లో గెలుపు, ఓట‌ముల‌ను స‌మానంగా స్వీక‌రించాల‌ని హిత‌వు ప‌లికారు.

ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా...

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా వరుస ట్వీట్లు చేశారు. ‘బీజేపీ పై గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ప్రజలు చూపిన ప్రేమ, విశ్వాసానికి ధన్యవాదాలు. నా శిరస్సు వంచి వారికి నమస్కరిస్తున్నా. ఆయా రాష్ట్రాలను అభివృద్ధి పథంలో నడిపించే విషయంలో వేలెత్తి చూపడానికి వీలులేకుండా ఉంటామని హామీ ఇస్తున్నాను. ఆయా రాష్ట్రాల్లో అభివృద్ధికి నిరంతరం పాటుపడతాం. సుపరిపాలన, అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారు. కష్టపడి పని చేసిన బీజేపీ కార్యకర్తలకు ధన్యవాదాలు’ అని మోదీ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles