new toll free numbers for train passengers రైలు ప్రయాణికులకు ఇక సమస్యలు దూరం..!

Indian railway digital system to solve passengers problems

indian railway, railway reservation, railway coach security, railway food high rates, railway quality food, railway enquiry, railway officials, rail toll free numbers, railway digital system

Indian railway officials bought new digital system to solve passengers problems, where passengers need to complain on through toll free numbers

రైలు ప్రయాణికులకు ఇక సమస్యలు దూరం..!

Posted: 10/31/2017 10:09 AM IST
Indian railway digital system to solve passengers problems

రైలు ప్రయాణికులకు ఇబ్బందులు, సమస్యలు తలెత్తకుండా కేంద్ర రైల్వే శాఖ చర్యలు తీసుకుంటుంది. ప్రయాణంలో రైలు ప్రయాణికులకు తలత్తే సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు గాను దృష్టి సారించింది. భద్రతాపరమైన సమస్యతో పాటు నీరు, అహారం తదితర ఎలాంటి సమస్యలనైనా ఇక వేగంగా పరిష్కారించుకోవచ్చు. ఇందుకోసం రైల్వేశాఖ కొత్తగా ప్రవేశపెట్టిన అన్ లైన్ విధానంలో అధికారులకు సమస్యను తెలిపితే చాలు.

అదెలా అంటారా..? దేశంలో ఎక్కడ నుంచైనా ఎవరైనా రైలులో ఎదుర్కొనే ఇబ్బందులు, కష్టాలను నేరుగా సంబంధిత అధికారులకు పిర్యాదు చేయవచ్చు. దీనికోసం ఎలాంటి ఖర్చు ఉండదు. మీ వద్ద ఉన్న మొబైల్‌ పోన్‌ ద్వారా టోల్‌ఫ్రీ నెంబర్లకు సందేశం పంపిస్తే చాలు. దీనికోసం రైల్వే శాఖ టోల్‌ ఫ్రీ నెంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే టోల్ ఫ్రి నెంబర్లు గుర్తుపెట్టుకోవాల్సి బాధ్యత ప్రయాణికులపైనే వుంది.
 
రైల్వే రిజర్వేషన్‌ కోసం...
ఐఆర్‌సీటీసీ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఆ తరువాత ఏ ప్రాంతానికి ఎప్పుడు వెళ్లాలి? ఏ రైళ్లో వెళ్లాలి? ఎంతమంది అనే విషయాలను ప్రయాణీకుల పేర్లతోపాటు అడ్రస్‌ నమోదు చేయాలి. ఇలా ఆన్‌లైన్‌ ద్వారా రిజర్వేషన్‌ చేసుకోవడానికి వెసులుబాటు వుంది.
 
టోల్‌ఫ్రీ నెంబర్‌ 182
రైళ్లలో భద్రత పరంగా ఏదైనా ఇబ్బందులు ఎదురైతే మెసేజ్‌ టైప్‌ చేసి ఈ నెంబరుకు సందేశం పంపాలి.
 
138
రైళ్లు ఆలస్యం, ఏ స్టేషన్‌కు రైలు ఎప్పుడు వస్తోందో తెలుసుకోవడానికి మొబైల్‌ పోన్‌ నుంచి సందేశం టైప్‌ చేసి ఈ టోల్‌ఫ్రీ నెంబరుకు పంపితే వెంటనే సమాచారం వస్తోంది.
 
ఇక రైళ్లలో ప్యాన్లు తిరగకపోవడం, ఏసీ పనిచేయకున్నా, మరుగుడొడ్లలో నీళ్లు లేకున్నా, రైల్వే స్టేషన్‌లలో అధిక ధరలకు తినుబండారాలు, వస్తువులు అమ్ముతున్నా, ప్లాట్‌ఫారాలు శుభ్రంగా లేకున్నా వెంటనే సంబంధిత మెసేజ్‌లను టైప్‌ చేసి 8121281212కు ఎస్‌ఎంఎస్‌ చేయాలి. ఇలా పంపిన సందేశాలు జనరల్‌ మేనేజర్‌ వద్ద వున్న కంట్రోల్‌ రూమ్‌కు వెళుతుంది. అక్కడ ఉన్న సిబ్బంది సంబంధిత విభాగాలకు సందేశాలను పంపి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : indian railway  reservation  security  railway enquiry  toll free numbers  digital system  

Other Articles