Former BCCI GM MV Sridhar passes away బిసిసిఐ జీఎం ఎంవీ శ్రీధర్ కన్నుమూత

Mv sridhar former bcci general manager dies of cardiac arrest

mv sridhar, mv sridhar cricketer, mv sridhar death, mv sridhar dead, , former ranji player, bcci general manager, team india manger, mv sridhar cardiac arrest, bcci, india cricket, cricket news, sports news, latest sports news

MV Sridhar, former Hyderabad cricketer and BCCI’s general manager of cricket operations, passed away on Monday morning at the age of 51 years.

బిసిసిఐ జీఎం ఎంవీ శ్రీధర్ కన్నుమూత

Posted: 10/30/2017 04:15 PM IST
Mv sridhar former bcci general manager dies of cardiac arrest

టీమిండియ క్రికెట్ మేనజర్ గా, బసిసిఐ జనరల్ మేనేజర్ గా, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా సేవలందించిన హైదరాబాద్‌ మాజీ రంజీ క్రికెటర్‌ ఎంవీ శ్రీధర్(51) ఇవాళ మధ్యాహ్నం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని స్టార్ అస్పత్రిలో చికిత్స పోందుతున్న ఆయన ఇవాళ గుండెపోటుతో చనిపోయారు. దీంతో ఆయన మృతదేహాన్ని జూబ్లీహిల్స్‌లోని స్వగృహానికి తరలించారు.

ఎంవీ శ్రీధర్ క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత ఆయన హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం కార్యదర్శిగా పనిచేసి అటు నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ.. బీసీసీఐ మేనేజర్ గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 1988-1999 మధ్యకాలంలో 97 ఫస్ట్ క్లాస్ మ్యాచులాడి 6వేల 701 పరుగులు చేశారు. ఇందులో 21 సెంచరీలు, 27 ఆర్థ శతాకాలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత పరుగులు 366. ట్రిపుల్ సెంచరీ చేసిన హైదరాబాద్ ఆటగాడిగా రికార్డ్ సృష్టించారు. 2013లో టీమిండియా జట్టుకి జనరల్ మేనేజర్ గా వ్యవహరించారు.

ఎంవీ శ్రీధర్ మృతికి బీసిసిఐ ప్రధాన సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపాన్ని ప్రకటించారు. శ్రీధర్ మృతి వార్తతో టీమిండియా క్రికెట్ లో కూడా విషాధఛాయలు అలుముకున్నాయి. టీమిండియా క్రికెటర్లతో పాటు మాజీలు, బిసిసిఐ సభ్యులు, కూడా శ్రీధర్ మృతిపట్ల సంతాపాన్ని ప్రకటించారు. హెచ్ సీఏ అధ్యక్షుడు వివేకానంద్, మాజీ మంత్రి వినోద్ సహా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles