Gorakhpur BJP leader arrested for accepting bribe సీఎం జోక్యంతో.. బీజేపి మహిళా నేత అరెస్టు

Gorakhpur bjp leader arrested for accepting bribe after cm intervenes

Gorakhpur, BJP leader, arrest, SI Raj Kumar, Harshit, thief, Rita Pandey, Sarita Singh, Cantonment Police Station, bribe, Adityanath, crime

A woman BJP leader from chief minister Adityanath’s constituency, Gorakhpur, was arrested recently following his intervention for reportedly accepting a bribe of Rs 50,000

సీఎం జోక్యంతో.. బీజేపి మహిళా నేత అరదండాలు

Posted: 10/21/2017 02:48 PM IST
Gorakhpur bjp leader arrested for accepting bribe after cm intervenes

ఇంటి దొంగలపై ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అహర్నిషలు కష్టపడి పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ఎందరో కష్టపడ్డారని, అలాంటిది.. ఇంటి దొంగలు తమ పార్టీ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇంతకీ ఆ ముఖ్యమంత్రి ఎవరో తెలుసా..? ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగీ అధిత్యనాథ్. తమ పార్టీకి చెందిన మహిళా మోర్చా నాయకురాలిని అరెస్టు చేయించి కటకటాల వెనక్కి పంపారు.

ఇంతకీ అమె చేసిన నేరమేంటో తెలుసా..? ఓ దోంగతనం కేసులో నిందితుడైన యువకుడ్ని బయటకు తీసుకురావడం కోసం సదరు వ్యక్తి తల్లి నుంచి ఏకంగా యాభై వేల రూపాయలు తీసుకుంది. యాబై వేల రూపాయలను ఇస్తే జైలుకు వెళ్లకుండా తన కొడుకును కాపాడతానని చెప్పిన బీజేపి నాయకులు.. డబ్బు తీసుకుని ముఖం చాటేసింది. దీంతో మోసపోయానని గ్రహించిన నిందితుడి తల్లి ఏకంగా ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి విషయాన్ని చెప్పడంతో అమెను అరెస్టు చేయించారు.

ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో ఈ జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి. గోరఖ్ పూర్ లోని అవాస్ వికాస్ కాలనీకి చెందిన హర్షిత్‌ పాండే అనే యువకుడు సెల్‌ ఫోన్ చోరీ కేసులో నిందితుడిగా వున్నాడు. దీంతో నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని తల్లి రీటా పాండేకు సమాచారం అందించారు. దీంతో ఆమె తనకు తెలిసిన వారితో కలిసి మాగానగర్ కు చెందిన బీజేపీ మహిళా మోర్చా నాయకురాలైన సరితా సింగ్ ను ఆశ్రయించారు.

తన కుమారుడ్ని ఎలాగైనా కాపాడాలని, జైలుకు వెళ్లకుండా చూడాలని వేడుకున్నారు. దీంతో ఆమె యాభై వేల రూపాయలు ఇస్తే హర్షిత్ ను జైలుకు వెళ్లకుండా కాపాడుతానని చెప్పారు. దీంతో ఆమె అడిగినట్టే డబ్బులు తెచ్చి ఇచ్చారు. అయితే పోలీసులు హర్షిత్ పాండేను జైలుకి పంపారు. దీంతో మోసపోయానని తెలుసుకున్న రీటా పాండే పోరిగింటివారికి విషయాన్ని చెప్పగా ప్రతిభా పాండే అనే మహిళ బాధితురాలని నేరుగా సీఎం యోగిఆదిత్యనాథ్ వద్దకు తీసుకెళ్లారు.

ఆ సమయంలో యోగి అధిత్యనాథ్ గోరఖ్ పూర్ లోనే వున్నారు. మహిళ తాను రెండు విధాలుగా బాధపడుతున్నానని, బీజేపి నేత సరితా పాండే నమ్మకద్రోహం చేసిందని అరోపించారు. దీంతో అక్కడే వున్న గోరఖ్ పూర్ ఎస్ఎస్పీ అనిరుద్దా పాండేను ఘటనపై నిలదీపి.., తక్షణం చర్యలు తీసుకోవాలని అదేశించారు. బాధితురాలు ఇచ్చిన పిర్యాదుతో బీజేపి మహిళా మోర్చా నేతను పోలీసులు అరెస్టు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles