rape on mentally disabled beggar in visakhapatnam మతిస్థిమితం లేని యాచకురాలిపై.. నడిరోడ్డుపై అత్యాచారం

Rape on mentally disabled beggar in visakhapatnam

rape in visakha, rape on beggar, rape in mentally disabled beggar, sexual assault on beggar, visakhapatnam, andhra pradesh, crime,

In a horrific incident a youth from visakhapatnam had raped a mentally disabled begger on road, as passers by instead of stoping the act had filmed in their mobile phones.

మతిస్థిమితం లేని యాచకురాలిపై.. నడిరోడ్డుపై అత్యాచారం

Posted: 10/23/2017 10:08 AM IST
Rape on mentally disabled beggar in visakhapatnam

నవ్విపోదురు గాక నాకేటి సిగ్గూ అన్నవాళ్లు అనాది కాలం నుంచి సభ్య సమాజంలో వున్నా.. నిలదీసి ప్రశ్నించే వారి సంఖ్య మాత్రం అధికంగానే వుండేది. అయితే మారుతున్న కాలంతో పాటు మారుతున్న టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో.. ఏ ఘటన జరిగుతున్నా.. దానిని అడ్డకుని కట్టడి చేసి చర్యలకు ఉపక్రమించాల్సిన అధికారులకు అప్పజెప్పాల్సిందిపోయి.. కేవలం తమ సెల్ ఫోన్ లలో బంధించేందుకే అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఇది ఏ ప్రమాదానికి సంబంధించిన ఘటనలో అయితే వేరు. కానీ ఏకంగా అత్యాచారం ఘటన జరుగుతున్న దానిని కూడా సెట్ ఫోన్ లలో బంధించేందుకు యత్నిస్తున్నారంటే నేటి యువత తీరుకు ఇది దర్పణం పడుతుంది.

సభ్య సమాజం తలదించుకునే విధంగా విశాఖలోని యువత ప్రవర్తించింది. మదమెక్కొన ఫైశాచిక మృగం.. పీకలదాకా మద్యం సేవించి నడిరోడ్డుపై పట్టపగలు మతిస్థిమితం లేని ఓ యాచకురాలిపై అత్యాచారం చేస్తుంటే, అడ్డుకుని వాడికి బుద్ది చెప్పాల్సిన యువత.. తమ సెల్ ఫోన్లు తీసి ఆ తతంగాని సిగ్గుతప్పి తమ సెల్ ఫోన్లలో బంధించేందుకే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. మగమృగం యాచకురాలిపై అత్యాచారానికి తెగబడినంతసేపు అక్కడి ప్రజలు వినోదం చూస్తూ ఉండిపోయారు.ఈ ఘటన విశాఖపట్నం, శ్రీనివాస కల్యాణమండపం రోడ్డులో జుగుప్స కలిగించింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, స్టేషన్ పరిసరాల్లో అడుక్కుంటూ జీవిస్తున్న ఓ మతిస్థిమితం లేని యువతిపై, రైల్వే న్యూ కాలనీకి చెందిన గంజి శివ (25) మద్యం తాగి వచ్చి అత్యాచారానికి దిగాడు. అటుగా వెళుతున్న వారు ఈ ఘటనను చూశారే తప్ప, ఎవరూ అడ్డుకోలేదు. ఆటో డ్రైవర్ అర్జి శ్రీను ఘటనను వీడియో తీస్తూ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆపై గంజి శివను అరెస్ట్ చేశామని, బాధితురాలిని ఆసుపత్రికి తరలించామని, కేసును విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rape  visakha  beggar  mentally disabled beggar  sexual assault  visakha crime  andhra pradesh  

Other Articles