Lord Shiva told me to beg: Russian tourist బెగ్గింగ్ బిజినెస్ సో బెటరు.. రష్యా మాటే వద్దు గురూ..

Lord shiva told me to beg russian tourist

Russian tourist news, Evgenii Berdnikov, Mambalam police, Lord Shiva, Russian tourist begging, russian tourist, Chennai (Madras), Tamil Nadu

Russian tourist Evgenii Berdnikov (24) was detained by the Mambalam police, a day after he said that he would continue begging in the city.

బెగ్గింగ్ బిజినెస్ సో బెటరు.. రష్యా మాటే వద్దు గురూ..

Posted: 10/16/2017 08:34 PM IST
Lord shiva told me to beg russian tourist

మీరు రష్యా వెళ్లిపోవచ్చు.. మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం.. మీ దేశం వెళ్లటానికి అవసరం అయిన డబ్బులు కూడా ఇస్తాం.. మీ దేశ రాయబారులతో మాట్లాడి మీ బ్యాంక్ అకౌంట్, ఏటీఎం కార్డు పిన్ నెంబర్ కూడా ఇప్పిస్తాం అని మరీ మరీ భాతరదేశం భరోసా ఇస్తున్నా.. ఇండియా విడిచి వెళ్లను అంటున్నాడు ఈ రష్యా బిచ్చగాడు ఈవ్ జెనీ బేర్టినీ కోవ్. కాంచీపురం పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి చెన్నై రష్యా రాయబార కార్యాలయానికి పంపారు. అలా వెళ్లిన బెర్టినీ కోవ్.. మళ్లీ గుళ్లు, గోపురాల దగ్గర ప్రత్యక్షం కావటం విచిత్రం.

అక్టోబర్ 15వ తేదీ ఆదివారం ఉదయం చెన్నైలోని టీ నగర్ లోని వేంకటేశ్వరస్వామి ఆలయం దగ్గర కోవ్ ప్రత్యక్షం అయ్యాడు. మెట్ల దగ్గర భిక్షమొత్తుతున్నాడు. సాయంత్రానికి ఉస్మాన్ రోడ్డులోని మరో ఆలయం దగ్గర కనిపించాడు. మళ్లీ ఏం కష్టం వచ్చిందో అని.. డబ్బులు ఇస్తాం మీ రష్యా దేశం వెళ్లిపో అంటూ స్థానికులు అంటే.. షాకింగ్ విషయాలు వెల్లడించాడు. నాకు రష్యా వెళ్లటం ఇష్టం లేదు.. ఇక్కడ ఆలయాల దగ్గర అడుక్కోవటమే బాగుందని సమాధానం చెప్పాడు.

నాతో సెల్ఫీ దిగటానికి పోటీ పడుతున్నారని.. ఒక్కో సెల్పీకి 10 రూపాయలు వసూలు చేస్తున్నట్లు వెల్లడించాడు. అంతేనా.. ఏ గుడి దగ్గర కూర్చున్నా డబ్బులు తెగ వేస్తున్నారని.. ఇండియాలో కేవలం నాలుగు వేల రూపాయలతోనే అడుగు పెట్టానని.. ఇప్పుడు నా దగ్గర 10వేలు ఉన్నాయని చెప్పాడు. నేను శివ భక్తుడిగా మారిపోయానని.. ఆ శివుడే భిక్షమెత్తుకోమని ఆదేశించినట్లు చెప్పుకొచ్చాడు. ఇక నుంచి ఇండియా మొత్తం పర్యటిస్తూ.. ఆలయాల దగ్గర భిక్షాటన చేస్తానని కూడా చెబుతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kavitha Lakshmi  TV actess  household name  Dosa Video  dosa seller  travel agency  Streedhanam  mollywood  

Other Articles