షిరిడీ సాయినాథుడి దర్శనాన్ని ఒక్క రోజులో ముగించుకుని మళ్లీ తమ స్వస్థాలలకు చేరుకునేలా ఎలాంటి రవాణా సౌకర్యం లేకపోవడంతో రోజుల తరబడి అనేక వ్యయప్రయాసలకు ఓర్చి ప్రయాణాలు చేస్తున్నారు. దీనికి తోడు రోడ్డు మార్గం కూడా అంతగా అనువుగా లేకపోవడం.. ఆ మార్గం ఇంకా అభివృద్దికి ఆమడ దూరంగా వుండటంతో.. భక్తులు కొంత నిర్లిఫ్తంగా వున్నారు. అయితే రైలు మార్గం వుందిగా అంటే.. అదీ అంతే.. కేవలం మన్మాడ్ నుంచి సాయినగర్ షిరిడీ చేరుకునేందుకే రెండున్నర గంటల సమయం పడుతుంది.
ఇదే సమయాన్ని సక్రమంగా వెచ్చిస్తే అదే సమయంలో ఏకంగా హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఏకంగా షిరిడీకి చేరుకోవచ్చు. మళ్లీ తిరిగి గమ్యస్థానానికి చేరుకోవచ్చు. అదెలా అంటే అదే వాయుమార్గం. పవిత్ర షిరిడీ సాయి దర్శనానికి వచ్చే సంపన్న, ఉన్నత మధ్య తరగతి భక్తులపై ఎట్టకేలకు సాయినాధుడు కటాక్షించాడు. షిరిడీలో వారి కోసం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సిద్దం చేశారు.
సాయి భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విమానాశ్రయం వచ్చనెల నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అక్టోబర్ 1న విమానాశ్రయాన్ని ఆవిష్కరిస్తారు. అదే రోజు షిరిడీ నుంచి ముంబై వరకు వెళ్లే విమానాలను కూడా ఆయన ప్రారంభించనున్నారు. ఆ తరువాత షిరిడీలో ప్రారంభం కానున్న సాయినాథుడి మహా సమాధి శతాబ్ది ఉత్సవాలలో రాష్ట్రపతి హాజరుకానున్నారు. షిరిడీలో సాయి దర్శనాన్ని చేసుకున్న తరువాత ఆయన ఈ కార్యక్రమాలలో పాల్గొననున్నారని సమాచారం.
కాగా విమానాశ్రయ రాకతో షిరిడీ సహా పరిసర ప్రాంతాలన్నీ శరవేగంగా అభివృద్ది బాటలో దూసుకుపోతాయని స్థానికులు అశాభావం వక్యం చేస్తున్నారు, దేశ అర్థిక రాజధాని ముంబై నుంచి షిరిడీకి కేవలం 40 నిమిషాలలో రావచ్చుని అధికారులు తెలుసగా, ఈ మేరకు ఇవాళ ముంబై నుంచి షిరీడీకి చేరుకున్న తొలి పరీక్షా విమానం.. ఏకంగా 45 నిమిషాల వ్యవధిలో చేరకుంది. దీంతో కొత్త ఏరోనాటికల్ రూట్ కావడంతో అలస్యమైందని, విమానాశ్రయం ప్రారంభం నాటికి ఈ సమయం కేవలం నలభై నిమిషాలకు చేరుకుంటుందని షిరిడీ ఏటీసీ అధికారవర్గాలు తెలిపాయి.
(And get your daily news straight to your inbox)
Jan 19 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామస్థాయిలో ఎన్నికల నిర్వహణ పంచాయితీ హైకోర్టుకు చేరిన తరుణంలో ఎన్నికల నిర్వహణ వుంటుందా.? లేదా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఫిబ్రవరిలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల... Read more
Jan 19 | అనునిత్యం దేశం కోసం.. దేశభక్తి కోసం ప్రసంగాలు గుప్పించే వ్యక్తుల నుంచి దేశానికి సంబంధించిన అత్యంత గోప్యమైన సమాచారం ఓ జర్నలిస్టుకు లీక్ కావడంపై కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా... Read more
Jan 19 | హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ లిమిటెడ్ సంస్థ రూపోందించిన కరోనా వాక్సీన్ కోవాక్సీన్ ను మూడవ దశ ట్రయల్స్ పూర్తి కాకుండానే అత్యవసర వినియోగం కోసం లైసెన్స్ పొందిన విషయం తెలిసిందే. అయితే... Read more
Jan 19 | నాగార్జునసాగర్ ఉప ఎన్నికను అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఉప ఎన్నికలలో భారీ మెజారిటీని సాధించేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో తమకు ఎదురులేదని.. మోనార్క్ ముద్రను వేసుకున్న టీఆర్ఎస్ ఇకపై ఎన్నికలంటే... Read more
Jan 19 | కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళిని భయం గుప్పెట్లోకి నెట్టిన తరువాత రెండో వేవ్ అంటూ భయాలు ఉత్పన్నమైన వేళ.. సెకెండ్ స్ట్రెయిన్ కూడా పలు దేశాలను అతలాకుతలం చేసింది. కరోనా నుంచి కోలుకున్న తరువాత... Read more