Maoist hotbed Bastar is a goldmine మావోల డెన్ కాదు.. గోల్డెన్ మైన్

Maoist hotbed bastar is a goldmine says ngri

Bastar, NGRI, National Geophysical Research Institute​, Gold, Chhattisgarh, maoist, extemists wing, gold deposits, research

Is CPI (Maoist), the largest left-wing extremists (LWE) group in the country, sitting over huge gold deposits in a large geographical area in Chhattisgarh?

అది మావోల డెన్ కాదు.. దాగివున్న గోల్డెన్ మైన్..

Posted: 09/27/2017 03:23 PM IST
Maoist hotbed bastar is a goldmine says ngri

యావత్ దేశంలోనే అత్యంత వెనుకబాటుకు గురవుతున్న జిల్లాల్లో బస్తర్ ఒకటి. ఇక్కడి వెనకబాటుకు మరో కారణం దట్టమైన అటవీ ప్రాంతం. దీంతో కేవలం గిరిపుత్రులకు మాత్రమే ఇది నెలవుగా మారింది.  అయితే అదే అటవీ ప్రాంతాన్ని తమ డెన్ గా మార్చుకున్న మావోలు.. అక్కడ నూతనంగా తమతో చేరిన వారికి శిక్షణ కూడా కల్పించేది ఇక్కడే. మరో విధంగా చెప్పాలంటూ మావోలకు బస్తర్ జిల్లాలోని అటవీ ప్రాంతం ఒక ప్రయోగశాల. లేదా ఓ శిక్షణా సంస్థ. ప్రస్తుతం బస్తర్ గురించి తెలిసిన వారికి వున్న అభిప్రాయం ఇది.

అయితే దీని గురించి రీసర్చ్ చేసిన శాస్త్రవేత్తలు చెబుతున్న మాట మాత్రం వేరేగా వుంది. బస్తర్ ఓ సాదరణ అటవీ ప్రాంతం కాదని, అది ఒక గొల్డెన్ డెన్ అని (బస్తర్ బంగారు భూమి) అంటున్నారు శాస్త్రవేత్తలు. ఎవరా సైంటిస్టులు అంటారా..? హైదరాబాద్ లోని జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థ (ఎన్జీఆర్ఐ) కు చెందిన శాస్త్రవేత్తలు. బస్తర్ ప్రాంతంలో విస్తారంగా బంగారు ఖనిజ నిక్షేపాలున్నాయని వారు తాజాగా జరిపిన పరిశోధనలోబయటపడింది.

బస్తర్ పరిధిలోని రాయగఢ్, జశ్ పూర్ జిల్లాల్లో ఏడు ప్రాంతాల్లో హైదరాబాద్ నుంచి వెళ్లిన ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తల బృందం అక్కడి భూమిలో వున్న ఖనిజ సంపదపై పరిశోధనలు చేసింది. పరీక్షలు నిర్వహించింది. ఆ ప్రాంతాల్లోని శిలల్లో ఉండే క్వార్జ్ సల్ఫైడ్ స్ఫటికాల్లో బంగారు రేణువులు కనిపించాయి. భూమిలోని అంతర్ ప్రవాహాల స్కానింగ్ ద్వారా ఈ విషయాన్ని కనిపెట్టామని వారు తెలిపారు. భూభౌతిక శాస్త్రం, స్పెక్ట్రోగ్రఫీల కలయికతో జరిపిన ఈ అధ్యయనాల్లో గోల్డ్ సల్ఫైడ్ తో సహా పలురకాల ఖనిజాల ఆచూకీ లభ్యమయ్యిందని చెప్పారు.

ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ టోమోగ్రఫీ (ఈఆర్టీ)ని ఉపయోగించి 100-200 మీటర్ల లోతులోని శిలలను ఎన్జీఆర్‌ఐ శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఈఆర్టీ అనేది మన మెదడును స్కానింగ్ చేసే యంత్రం లాంటిదే. దీనిని ఉపయోగించి శిలలను స్కాన్ చేస్తే వాటిలోని ఖనిజ లక్షణాలు తెలిసిపోతాయి. ఈ తరహా స్కానింగ్‌లో బంగారం ఉన్నట్టు బయటపడింది. బురదమట్టిని జల్లించే సంప్రదాయిక పద్ధతిలోనూ బంగారు రేణువులకోసం అన్వేషించారు. బస్తర్‌లో స్థానికులు ఇప్పటికీ ఈపద్ధతి ద్వారానే బంగారం కోసం అన్వేషిస్తుంటారు. రెండు పద్ధతుల్లోనూ బస్తర్‌లో బంగారం ఉన్నట్లు బయటపడింది. నిక్షేపాల ఎంత పరిణామంలో వున్నాయన్న విషయమై మలి అద్యయనాలు చేసి తెలుసుకోవాల్సి వుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles