6-month wait not a must for divorce say SC ఇన్ స్టెంట్ విడాకులపై సుప్రీం కీలక ఉత్తర్వులు

Mutual consent 6 month cooling off period not mandatory for divorce

divorce, Supreme Court, Hindu Marriage Act, couples divorce, Supreme Court, divorce, cooling period, 6 months period, 1955 Hindu Marriage Act, section 13B(2), mutual consent, mandatory, Current Affairs

A bench of justice Adesh Kumar Goyal and UU Lalit in its order said that 'we are in the view that period of mentioned in section 13B (2) of Hindu Marriage Act is not mandatory but directory'

ఇన్ స్టెంట్ విడాకులపై సుప్రీం కీలక ఉత్తర్వులు

Posted: 09/13/2017 02:24 PM IST
Mutual consent 6 month cooling off period not mandatory for divorce

వైవాహిక వ్యవస్థను పటిష్టం చేసే క్రమంలో భార్యల సమ్మతి లేకుండా వారితో శృంగారంలో పాల్గొన్నా దానిని మారిటల్ రేప్ గా పరిగణించలేమని ఇటీవల తీర్పును వెలువరించిన దేశ సర్వోన్నత న్యాయస్థానం.. అదే వివాహ బంధంతో ఏకమైయ్యే భార్యభర్తల మధ్యమాత్రం కూలింగ్ పిరియడ్ అన్నది లేకుండా విచారిస్తున్న కింద కోర్టులో విడాకుల కేసులను విచారిస్తున్న న్యాయమూర్తుల అభిప్రాయానికే వదిలేస్తూ సంచలన ఉత్తర్వులను జారీ చేసింది.

భార్యాభర్తలు విడిపోతామని నిర్ణయించుకున్నాక, ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ జీవించే అవకాశం లేనప్పుడు ఆరు నెలల కూలింగ్ పిరియడ్ నిబంధనను పాటించాల్సిన అవసరం లేదని, ట్రయల్ కోర్టులు వారికి వెంటనే విడాకులు మంజూరు చేయవచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది. 8 సంవత్సరాల నుంచి విడిగా ఉంటున్న ఓ జంట విడాకుల కోసం దరఖాస్తు చేస్తూ ఆరు నెలల కూలింగ్  పిరియడ్‌ను సవరించి విడాకులు మంజూరు చేయల్సిందిగా కోర్టును అభ్యర్థించింది. ఈ కేసును విచారించిన జస్టిస్ ఏకే గోయల్, జస్టిస్ లలిత్‌లతో కూడిన ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది.

నిజానికి 1955 హిందూ వివాహ చట్టం ప్రకారం విడాకుల కోసం దరఖాస్తు చేసిన ఆరు నెలల వరకు డైవోర్స్ మంజూరు చేయడానికి వీల్లేదు. దరఖాస్తుదారుల మనసులు మారే అవకాశం ఉండడంతో చట్టంలోని 13బి (2) సెక్షన్ ఆరు నెలల పాటు కూలింగ్ పిరియడ్‌ను పేర్కొంది. అయితే దంపతులు తాము ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసి ఉండే అవకాశం లేదని బలంగా భావిస్తే ఈ నిబంధనను పట్టించుకోవాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు పేర్కొంది. కాబట్టి ఆ ఆరు నెలల కాల వ్యవధిని సడలించి విడాకులు మంజూరు చేసే అవకాశం ట్రయల్ కోర్టులకు ఉందని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : divorce  Supreme Court  Hindu Marriage Act  couples divorce  Supreme Court  

Other Articles