Fake note manufacturing base at Bangladesh ఇండియన్ నకిలీ నోట్లకు అడ్డగా మారిన బంగ్లాదేశ్

Bangladesh hub of fake indian currency

Demonetisation, Fake Notes, Pakistan, Bangladesh, Rs 2000 notes, Fake Currency, Fake Indian Currency

The government’s move to demonetise old Rs 500 and Rs 1,000 notes seems to have failed resulting in end of fake currency, as bangladesh became a hub of fake Indian currency.

ఇండియన్ నకిలీ నోట్లకు అడ్డగా మారిన బంగ్లాదేశ్

Posted: 09/13/2017 01:43 PM IST
Bangladesh hub of fake indian currency

పెద్ద నోట్ల రద్దును తెరపైకి తీసుకువచ్చిన కేంద్రప్రభుత్వం.. ఇది మోడీ సర్కార్ సాహసోపేత నిర్ణయమని వెల్లడించినా.. ఆ తరువాత ఈ ప్రజల నుంచి నోట్ట రద్దు ఎందుకు? అన్న ప్రశ్నకు కూడా పలు సమాధానాలను చెప్పింది. వాటిలో ఒకటి నకిలీ నోట్ల నియంత్రణ. అయితే కొత్తగా కేంద్రం ప్రవేశపెట్టిన కరెన్సీ నోట్లను అక్రమార్కులు ఫేక్ కరెన్సీ సృష్టించవచ్చు కదా.. అన్న ప్రశ్నకు సమాధానమిచ్చిన కేంద్రం.. కొత్త కరెన్సీలను పాకిస్థాన్ దేశం నకిలీని చేయడం అసాధ్యమని కూడా చెప్పారు. కానీ అది నిజం కాదని తాజాగా వెలుగులోకి వచ్చిన ఘటనలు స్పష్టం చేస్తున్నాయి.

కొత్త నోట్లు విడుదలైన నెల రోజుల నుంచే దేశంలో ఫేక్‌ కరెన్సీ చెలామణిలోకి రావటం మొదలైందని ఘటనలు దృవపరుస్తున్నాయి. అయితే పాకిస్థాన్ నుంచి దేశీయ వ్యవస్థలోకి వచ్చే నకిలీ నోట్ల సంఖ్య కేంద్రం చెప్పినట్లుగానే తగ్గినా.. మార్గం మార్చుకుని వయా బంగ్లాదేశ్ మార్గం నుంచి వస్తున్నాయి. దీంతో నకిలీనోట్ల విషయంలో పాకిస్థాన్ ను వెనక్కు నెట్టిన బంగ్లాదేశ్ అగ్రస్థానంలో వుంది. అత్యధికంగా రెండు వేల రూపాయల నకిలీ నోట్లను బంగ్లా సరిహద్దు నుంచే స్వాధీనం చేసుకున్నామని సరిహద్దు భద్రతా బలగాలు వెల్లడించాయి.

పాకిస్థాన్‌, బంగ్లాదేశ్ లలో ముద్రితమై అక్రమమార్గల ద్వారా దేశంలోని 13 ప్రాంతాలకు వచ్చేవి. వీటిలో 11 ప్రాంతాలు గతంలో చాలాసార్లు వార్తల్లో నిలిచాయి. అయితే అస్సాంలోని గౌహతి, పశ్చిమబెంగాల్‌ ప్రాంతాలు మాత్రం ఈ యేడాది నుంచే నకిలీ నోట్ల చెలమణికి అడ్డగా మారాయని అధికారులు చెబుతున్నారు.
 
ఈ యేడాది మొదటి ఆరునెలలో 32 లక్షలను బీఎస్‌ఎఫ్‌ దళాలు స్వాధీనపరుచుకోగా.. గతంలో కంటే తక్కువే పట్టుబడింది. ప్రస్తుతం వీటి సంఖ్య తక్కువగానే ఉన్నా రానున్న రోజుల్లో నకిలీ కరెన్సీ  ఉధృతం చేసేందుకు స్మగ్లర్లు ప్రయత్నిస్తున్నారని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే సౌదీ ఆరేబియా, మలేషియాల నుంచి మన కొత్త నోట్లకు సంబంధించిన పేపర్ ను తెప్పించుకుని స్మగ్లర్లు ముద్రించేపనిలో వున్నారన్నది సమాచారం.

కాగా గతంలో స్మగర్లు నకిలీ నోట్ల ముద్రణకు అచ్చంగా దేశీయ కరెన్సీలో వినియోగించే కావాల్సిన కాటన్ రాగ్ సరుకుకు బదులుగా అప్ సెట్ ప్రిటింగ్ మిఫన్ల ద్వారా నోట్లను ముద్రిస్తున్నారని, దీంతో నకిలీ కరెన్పీని సులువుగా గుర్తించే అవకాశాలు వున్నాయని అంటున్నారు. ఇక కొత్త కరెన్సీని తయారు చేయటానికి కావాల్సిన యంత్రాలు అమ్మాకాలు కూడా ఆయా దేశాలకు మాత్రమే విక్రయిస్తుండగం ద్వారా నకిలీ నోట్ల స్మగ్లర్ల అటలు మునుపటిలా సాగడం లేదని నిపుణులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Demonetisation  Fake Notes  Pakistan  Bangladesh  Rs 2000 notes  Fake Currency  Fake Indian Currency  

Other Articles